technology

వెంటనే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ ని ఫోన్ నుంచి తీసేయండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ మాత్రం ఫోన్ లో ఉండకూడదు. వీటి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మోసాలు కూడా ఎక్కువైపోయాయి. ఎక్కడికి మనం వెళ్లక్కర్లేదు మన ఫోన్ మన దగ్గర ఉంటే చాలు. రకరకాలుగా మోసాలకి పాల్పడుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. స్కామర్లు వివిధ రకాల టెక్నిక్స్ తో ఖాతాని ఖాళీ చేస్తున్నారు. ఫేక్ యాప్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి యాప్స్ ఉండడం వలన ప్రమాదంలో పడతారు.

గూగుల్ ప్లే స్టోర్లో క్రిప్టో కరెన్సీని దోచుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. ప్లే స్టోర్ నుంచి తీసివేయబడడానికి ముందు ఐదు నెలలకు పైగా గుర్తించబడలేదు. మార్చి 2024 లో గూగుల్ ప్లే స్టోర్ కి అప్లోడ్ చేయబడింది. చాలామంది ఈ యాప్ ని ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్ లని టార్గెట్ చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించిన యాప్ ‘వ్యాలెట్ కనెక్ట్ ఎయిర్ డ్రాప్ వ్యాలెట్’.

remove these apps immediately from your phone

ఈ నకిలీ యాప్ గత కొన్ని నెలలుగా చాలా మందిని మోసం చేసింది. చాలా ఫేక్ రివ్యూస్ తో ఈ యాప్ నడుస్తోంది ఐదు నెలల లో పెట్టుబడిదారుల నుంచి సుమారు 70 వేల డాలర్లు అంటే 58.6 లక్షల రూపాయలని దొంగలించడంలో హ్యాకర్లు విజయాన్ని సాధించారు. పదివేల మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేశారు. ఇలాంటి యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే అనవసరంగా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది.

Peddinti Sravya

Recent Posts