వినోదం

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ దాడి సీన్‌.. అస‌ల‌క్క‌డ జంతువులే లేవుగా.. వీఎఫ్ఎక్స్‌తో మాయ చేశారు..!

RRR Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవడంతో అంత‌ర్జాతీయ స్థాయిలోనూ దీనికి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఎంతో మంది ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని, ఈ మూవీని పొడ‌గ్త‌ల్లో ముంచెత్తారు. రాజ‌మౌళి ప్ర‌తిభ‌ను కొనియాడారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే ఎన్నో సీన్లు ఉన్నాయి. కానీ వాటిల్లో బ్రిటిష్ వారిపై భీమ్ జంతువుల‌తో దాడి చేసే సీన్ ఒక‌టి ఉంటుంది. ఇది సినిమా మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి.

ఇక ఈ సీన్‌ను పూర్తి స్థాయిలో వీఎఫ్ఎక్స్‌లోనే చిత్రీక‌రించారు. వాస్త‌వానికి అందులో జంతువులు ఏవీ లేవు. అవ‌న్నీ గ్రాఫిక్సే కావ‌డం విశేషం. అయితే ఈ సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ప‌నిచేసిన సూప‌ర్‌వైజ‌ర్ శ్రీ‌నివాస మోహ‌న్ గ‌తంలోనే ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియోను షేర్ చేశారు. అది ఎంత‌గానో అల‌రించింది. అస‌లు జంతువులు ఏవీ లేకుండానే అవి ఉన్న‌ట్లుగా ముందుగానే సీన్ల‌ను తీశారు. త‌రువాత వాటికి వీఎఫ్ఎక్స్‌ను జోడించారు. ఈ విష‌యం శ్రీ‌నివాస మోహ‌న్ షేర్ చేసిన వీడియోను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

rrr movie bheem animals scene vfx video

ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ జంతువుల‌తో క‌లిసి బ్రిటిష్ వారిపై దాడి చేసే సీన్‌లో అస‌లు జంతువులే లేవు. అయిన‌ప్ప‌టికీ అవి దాడి చేసిన‌ట్లు, వాటి నుంచి త‌ప్పించుకున్న‌ట్లు ఎంతో చ‌క్క‌గా సీన్ల‌ను తెర‌కెక్కించారు. ఇది రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆ సీన్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో గతంలో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. అస‌లు ఆ సీన్‌ను అలా ఎలా తీశారు.. అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Admin

Recent Posts