lifestyle

Money : రోడ్డు మీద డ‌బ్బులు దొరికియా.. వాటిని తీసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Money : రోడ్డుమీద వెళ్లినప్పుడు ఒక్కొక్కసారి మనకి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. అయితే రోడ్డు మీద వెళ్లినప్పుడు డబ్బులు కనిపిస్తే మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా..? చాలామందిలో ఈ సందేహం ఉంటుంది. రోడ్డు మీద మనకి ఏవైనా డబ్బులు కనపడితే, వాటిని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని.. మరి దానికి సమాధానం ఇప్పుడే చూసేద్దాం.. మనకి రోడ్డు మీద వెళ్లినప్పుడు డబ్బు కనపడితే ఏం చేయాలనేది తెలియదు. కొందరు వాటిని తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు.

ఇంకొందరు ఏం చేస్తారంటే ఆ డబ్బును తీసుకువెళ్లి ఆలయానికి కానీ పేదలకు కానీ చేస్తూ ఉంటారు. అయితే ఇలా డబ్బుని తీసుకోవచ్చా..?, తీసుకోకూడదా..?, తీసుకోవడం వలన మంచి జరుగుతుందా.. అరిష్టమా అనేది చూస్తే.. రోడ్డు మీద పడి ఉన్న డబ్బును తీసుకుంటే శుభం కలుగుతుంది. రోడ్డుమీద పడి ఉన్న డబ్బులని చూస్తే పూర్వీకుల ఆశీర్వాదం మనకి అందుతుంద‌ని వాస్తు శాస్త్రం అంటోంది.

what happens if you take money found on the road

వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు వెళ్తున్నప్పుడు, దారిలో మీకు డబ్బులు కనపడితే, మీరు చేయబోయే పని కచ్చితంగా పూర్తవుతుందని, విజయాన్ని అందుకోవచ్చని దానికి సంకేతం. పని అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తున్నప్పుడు, డబ్బు కనపడితే త్వరలో ఆర్థిక ప్రయోజనాలని పొందుతారని దాని వెనుక అర్థం. రోడ్డు మీద పడి ఉన్న డబ్బును తీసుకుని మీరు ఆలయాలకి విరాళంగా ఇవ్వచ్చు.

లేదంటే మీరు మీ ఇంటికైనా తీసుకువెళ్లొచ్చు. కానీ ఆ డబ్బులు మాత్రం ఖర్చు చేయకూడదు. దారిలో పడి ఉన్న డబ్బులు మీకు కనపడితే, కొత్త పనిని ప్రారంభించవచ్చు అని కూడా దానికి సంకేతం. చూశారు కదా రోడ్డు మీద పడి ఉన్న డబ్బుని ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనేది. ఈసారి డబ్బులు కనపడితే మరి ఇక ఎలాంటి చింత లేకుండా ఈ విధంగా పాటించండి. తెలియని వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్పండి.

Admin

Recent Posts