Tuesday Works : సాధారణంగా మనలో చాలా మందికి మంగళవారం అంటే భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను, శుభ కార్యాలను ఎక్కువగా మంగళవారం నాడు చేయరు. అసలు మంగళ వారం నాడు చేయకూడని పనులు ఏవి అలాగే ఎటువంటి పనులను మంగళవారం నాడు చేయవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారినికి కుజుడు అధిపతి. నవగ్రహాల్లో కల్లా కోపం ఎక్కువగా ఉన్న గ్రహం కుజుడు. అందుకే మంగళవారం నాడు పది మంది కలిసి చేసే పనులు చేయకూడదు. సభలు, సమేవేశాలు నిర్వహించకూడదు. కుజుడు ప్రభావం వల్ల కోపం ఎక్కువగా వచ్చి మాట మాట పెరిగే అవకాశం ఉంది. మంగళవారం నాడు ముఖ్యమైన పనులకు వెళ్లడం వల్ల కుజుడు ప్రభావం వల్ల కోపం ఎక్కువగా వచ్చి గొడవలు జరిగే అవకాశం ఉంది.
అలాగే మంగళవారం నాడు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. మంగళవారం నాడు డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల ఆ డబ్బు మళ్లీ తిరిగి రాదని పండితులు చెబుతున్నారు. అదే విధంగా మంగళవారం నాడు ఆక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కనుక మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయాలి. ఇక మంగళవారం చేయదగిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం నాడు అప్పులను తీర్చాలి. బ్యాంక్ లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి. మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా మంగళవారం నాడు టీవి, రిఫ్రిజిరేటర్ వంటివి రిపేర్ చేయించుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్ లలో జాయిన్ అవ్వవచ్చు. అలాగే కోర్టు సమస్యలు, కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి ముఖ్యమైన వ్యక్తులతో మద్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భూమి కొనుగోలు చేయడానికి, ఇళ్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
వైద్యులను కలిసి సూచనలు తీసుకోవాలన్నా, సర్జరీలు చేయించుకోవాలన్న మంగళవారం నాడు చేయించుకోవడం మంచిది. అలాగే వ్యవసాయదారులు మిరప,అల్లం, పొగాకు, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది. చాలా మంది మంగళవారం అనగానే అమంగళవారం అని భయపడిపోతుంటారు. కొన్ని పనులనే మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు. మంగళవారం నాడు పైన చెప్పిన పనులను చేయడం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.