Sanju Samson : సొంత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పైనే కెప్టెన్ సంజు శాంస‌న్ ఆగ్ర‌హం..!

Sanju Samson : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. తొలి మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో దాదాపుగా 2 నెల‌ల పాటు క్రికెట్ ప్రేక్ష‌కులు ఎంచ‌క్కా టీ20 క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ ఎంతో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ కూడా ఈ సారి అమీ తుమీకి సిద్ధ‌మైంది. అయితే ఆ జ‌ట్టు సోష‌ల్ మీడియా టీమ్ చేసిన ప‌ని ఆ జ‌ట్టు కెప్టెన్ సంజు శాంస‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Sanju Samson angry on his own Rajasthan Royals team
Sanju Samson

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ ఫొటోను మార్ఫింగ్ చేసిన ఆ జ‌ట్టు సోష‌ల్ మీడియా టీమ్ దాన్ని తమ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి తోడు ఆ ఫొటోకు క్యాప్ష‌న్ కూడా పెట్టారు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి.. అంటూ కామెంట్ పెట్టారు. వాస్త‌వానికి ఆ ఫొటో చాలా ఎబ్బెట్టుగా ఉంది. దీంతో సంజు శాంస‌న్‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే ఈ విష‌యాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. త‌మ సోష‌ల్ మీడియా టీమ్ చేసిన మార్ఫింగ్ ప‌ని అత‌నికి ఏమాత్రం న‌చ్చ‌లేదు. దీంతో ఆ టీమ్‌పై జ‌ట్టు యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేశాడు.

అయితే ఆ ఫొటోను మార్ఫింగ్ చేసిన త‌మ సోష‌ల్ మీడియా టీమ్ స‌భ్యుడిని ఆ జ‌ట్టు తొల‌గిస్తుంద‌ని తెలుస్తోంది. ఐపీఎల్ కోసం ఓ వైపు తాము క‌ఠోర సాధ‌న చేస్తూ మ్యాచ్‌ల కోసం సిద్ధ‌మవుతుంటే.. ఉత్సాహం అందించే పోస్టుల‌ను పెట్టాల్సింది పోయి.. ఇలాంటి చ‌వ‌క‌బారు మార్ఫింగ్ ఫొటోల‌ను పెడ‌తారా.. అంటూ సంజు శాంసన్ నిప్పులు చెరిగాడ‌ట‌. దీంతో ఈ విష‌యంపై జట్టు మేనేజ్‌మెంట్ సీరియ‌స్‌గానే స్పందించింది. ఆ ఫొటోను పోస్ట్ చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌ను హైద‌రాబాద్‌తో క‌లిసి ఈ నెల 29వ తేదీన పూణెలో ఆడ‌నుంది.

Editor

Recent Posts