Coconut Water : వేసవి కాలంలో మనకు సహజంగానే శరీరం వేడిగా అవుతుంటుంది. దీంతో మనం బయట ఉంటే కచ్చితంగా కొబ్బరినీళ్లను తాగుతాం. ఈ సీజన్‌లో జీర్ణ సమస్యలు కూడా చాలా మందికి వస్తుంటాయి. అలాంటి వారికి కూడా కొబ్బరి నీళ్లు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే కొబ్బరి నీళ్లను మనం కావాలనుకుంటే లీటర్ బాటిల్స్‌లోనూ ఇస్తారు. కానీ కొబ్బరి నీళ్లను తీసే విధానం దాదాపుగా ఎక్కడైనా ఒక్కటే రకంగా ఉంటుంది. బొండాన్ని కత్తితో నరికి నీళ్లను తీసి ఇస్తారు. లేదా అందులోనే స్ట్రా వేసి ఇస్తే తాగుతాం. ఇలా కొబ్బరినీళ్లను మనం బొండాల నుంచి తాగుతుంటాం. అయితే ఆ వ్యక్తి మాత్రం సోడా బండి మీద సోడా విక్రయించినట్లు చాలా పద్ధతిగా కొబ్బరినీళ్లను గ్లాసులో పోసి మరీ విక్రయిస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అర్జున్ సోనీ అనే వ్యక్తి కరోనా సమయంలో ఓ చక్కని ఉపాయం చేశాడు. ఎవరినీ ముట్టుకోకుండా కొబ్బరినీళ్లను విక్రయించేందుకు ఓ ఆలోచన చేశాడు. అందుకు గాను అతను ఓ మెషిన్‌ను ఉపయోగించాడు. దానికి కరెంట్ అవసరం లేదు. చేత్తోనే ఆపరేట్ చేయవచ్చు. కొబ్బరిబొండాన్ని ఆ మెషిన్‌లో ఉండే ఒక అమరికలో కూర్చోబెట్టాలి. అనంతరం పై నుంచి వచ్చే ఓ లీవర్‌కు ఒక వెడల్పైన లావు పాటి సూదిలాంటి పరికరాన్ని ఉంచుతాడు. ఈ క్రమంలో లీవర్‌కు ఉంచిన ఆ సూది లాంటి పరికరం నేరుగా కిందకు వచ్చి బొండాంలో గుచ్చుకుంటుంది. అందుకుగాను మెషిన్‌కు ఉండే ఇంకో లీవర్‌ను ఆపరేట్ చేయాలి. ఇక లోపలికి గుచ్చుకున్న తరువాతా బొండాన్ని తెచ్చి ఇంకో పాత్రపై బోర్లిస్తాడు. దీంతో సూది లాంటి ఆ పరికరం నుంచి నేరుగా నీళ్లు శుద్ధి అయి కింద ఉంచిన గ్లాస్‌లో పడతాయి. అలా కొబ్బరి నీళ్లతో గ్లాస్ నిండుతుంది.
ఇక ఆ గ్లాస్‌లోని కొబ్బరి నీళ్లు ఫిల్టర్ అయి వస్తాయి కనుక చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇలా ఒక గ్లాస్ కొబ్బరినీళ్లను అతను రూ.50కి విక్రయిస్తున్నాడు. పూర్తిగా కాంటాక్ట్ లెస్ పద్ధతిలో అతను కొబ్బరినీళ్లను అమ్ముతున్నాడు. దీంతో అతన్ని అందరూ అభినందిస్తున్నారు. అయితే ఈ వీడియో పాతదే అయినా.. చాలా మంది ఇప్పటికీ దీన్ని వీక్షిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది.