technology

ఫోన్ నంబ‌ర్ సేవ్ చేయ‌కుండానే వాట్సాప్ మెసేజ్‌ల‌ను పంపండి ఇలా..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ రోజు రోజుకీ కొత్త ఫీచర్లని కూడా తీసుకు వస్తోంది. వాట్సాప్ వల్ల మనకి అనేక ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈజీగా మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా ప్రతి దానికి కూడా మనం ఉపయోగించొచ్చు. అయితే, వాట్సాప్ లో మనం ఒకరి నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్లకి మెసేజ్ ఎలా పంపొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విధంగా వాట్సాప్ లో మెసేజ్లు పంపొచ్చు. అది కూడా నెంబర్ సేవ్ చేసుకోకుండానే.

ముందుగా వాట్సప్ యాప్ ని ఓపెన్ చేయండి. ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ని కాపీ చేయండి. న్యూ చాట్ బటన్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నెంబర్ ని పేస్ట్ చేయండి. ఆ నంబర్ కి వాట్సాప్ ఉన్నట్లయితే చాట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా నేరుగా మీరు నెంబర్ ని సేవ్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.

send whatsapp messages without saving phone number

మరి కొన్ని ఆప్షన్స్. గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు నెంబర్ ని సేవ్ చేయకుండానే మెసేజ్ ని పంపొచ్చు. వాట్సాప్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు ఒకరి నెంబర్ సేవ్ చేసుకోకుండా డైరెక్ట్ గా పంపొచ్చు.

Peddinti Sravya

Recent Posts