వినోదం

Sid Sriram : బాబోయ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాట‌కు అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడా..!

Sid Sriram : తెలుగు వాడు కాక‌పోయినా ఎక్కువ సూప‌ర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్. ఈయ‌న పాట‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు ఉండ‌రు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది. ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే. ఇటీవ‌ల మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్. అత‌ని పాట‌లో ఏదో తెలియ‌ని తీయ‌ద‌నం ఉంటుంది. సిద్ పాట వింటే వెంట‌నే అలా క‌నెక్ట్ అయిపోతుంటాం. పాట ఏదైనా అది సిద్ పాడితే హిట్ అవ్వాల్సిందే. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయ‌న పాడిన పాట‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

త‌మిళ‌నాడులో పుట్టి అమెరికాలో పెరిగిన శ్రీ‌రామ్ డియ‌ర్ కామ్రెడ్ సినిమాతో తెలుగు సినీ పాట‌ల ప్ర‌స్థానం మొద‌లు పెట్టాడు. దక్షిణాది ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో ఉన్న టాప్ మోస్ట్ పాపులర్ సింగ‌ర్ల‌లో ఒక‌రిగా సిద్ శ్రీ‌రామ్ ఉన్నాడు. ఆయ‌న ఒక్క‌పాట‌కు రూ.5ల‌క్ష‌ల నుండి రూ.7ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. టాప్ సింగ‌ర్స్ కూడా ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్స్ అందుకోరు. కానీ త‌న పాట‌ల‌కు వ‌స్తున్న రెస్పాన్స్ బ‌ట్టి సిద్‌కి ఆ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క త‌ప్ప‌డం లేదు.

singer sid sriram remuneration per song

మాటే వినదుగాపాట నుండి మొన్న వచ్చిన శ్రీ వల్లి పాట దాకా సిద్‌ శ్రీరామ్‌ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. టాక్సీవాలాలో మాటే వినదుగా.., అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన.., 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? లో నీలి నీలి ఆకాశం.., వకీల్‌ సాబ్ లో మగువా మగువా.., రంగ్‌ దేలో నా కనులు ఎపుడు.., పుష్పలో పాడిన శ్రీవల్లి.. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్‌ ఖాతాలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి.

Admin

Recent Posts