వినోదం

Ram Charan : వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ కార్ డ్రైవ‌ర్ జీతం అంత‌నా..?

Ram Charan : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌డంతో ఇప్పుడు ఆయ‌న రెమ్యున‌రేష‌న్ మ‌రింత‌గా పెరిగింది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా. 14 ఏళ్ళ కెరీర్‌లోనే మగధీర, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న చ‌ర‌ణ్.. చిరుత, నాయక్, ఎవడు, ధృవ లాంటి విజయాల‌ను కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

రామ్ చ‌ర‌ణ్ త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే వారిని చాలా ప్రేమ‌గా చూసుకుంటాడు. వారికి త‌న లెవ‌ల్‌లోనే జీతాలు ఇస్తుంటాడు. ఇక అప్పుడప్పుడు వారి ఇంట్లో వేడుకల‌కు హాజ‌రు కావ‌డ‌మే కాక త‌న సిబ్బంది బ‌ర్త్ డేల‌ను స్వ‌యంగా సెల‌బ్రేట్ చేస్తుంటాడు చ‌ర‌ణ్‌. అయితే తాజాగా రామ్ చ‌ర‌ణ్ డ్రైవ‌ర్ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

do you know about ram charan car driver salary

రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద పనిచేస్తున్న డ్రైవ‌ర్ జీతం నెల‌కు రూ.45 వేల వ‌ర‌కూ ఉంటుందట‌. ఇది ఓ సాధార‌ణ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ జీతంతో స‌మాన‌మే చెప్పాలి. ఒక‌సారి రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ప‌ని కుదిరితే వారిని తీసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డ‌ట‌. క‌రోనా స‌మ‌యంలో త‌మ సిబ్బంది డ్యూటీకి రాక‌పోయిన కూడా వారికి జీతాలు ఇచ్చి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నాడు చ‌ర‌ణ్‌.

Admin

Recent Posts