Sorakaya Pachadi : మనం సొరకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సొరకాయలతో చేసుకోదగిన వంటకాల్లో సొరకాయ పచ్చడి కూడా ఒకటి. సొరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఈ పచ్చడిని ఒక్కో విధంతా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే సొరకాయ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయను కాల్చి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. మరింత రుచిగా, తక్కువ సమయంలో సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – 500గ్రా., నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 15 నుండి 18, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 8, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా సొరకాయను శుభ్రంగా కడగాలి. తరువాత నూనె రాసుకుని ఫోర్క్ తో అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద స్టాండ్ ను ఉంచి దానిపై సొరకాయను ఉంచి అటూ ఇటూ తిప్పుతూ నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత సొరకాయపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నువ్వులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చింతపండు వేసి కలిపి చల్లారనివ్వాలి.
ఇప్పుడు జార్ లో నువ్వులు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఎండుమిర్చి, తాళింపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన సొరకాయ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.