Spicy Curd Rice : పెరుగుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కర్డ్ రైస్ కూడా ఒకటి. కర్డ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. కర్డ్ రైస్ ను తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ కర్డ్ రైస్ ను మరింత రుచిగా మరింత స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే కర్డ్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. లంచ్ బాక్స్ లల్లోకి ఈ కర్డ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇలా కర్డ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. మరింత స్పైసీగా కర్డ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ కర్డ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, చిలికిన పెరుగు – ఒక కప్పు, ఉప్పు -తగినంత, నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1,తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్పైసీ కర్డ్ రైస్ తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పెరుగన్నంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ కర్డ్ రైస్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.