Spicy Rasam : ద‌గ్గు, జ‌లుబు ఇబ్బందులు పెడుతున్నాయా.. ఇలా ర‌సం చేసుకుని అన్నంలో తినండి..!

Spicy Rasam : మ‌నం వంటింట్లో త‌ర‌చుగా ర‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. ర‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ర‌సంతో అన్నాన్ని ఇష్టంగా తింటారు. అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డే ఈ ర‌సాన్ని మ‌నం మ‌రింత రుచిగా మ‌రింత ఘాటుగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఇలా త‌యారు చేసిన ర‌సాన్ని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డ‌చ్చు. మ‌రింత రుచిగా, మ‌రింత ఘాటుగా ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాట – 1, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, ఎండుమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Spicy Rasam recipe vey tasty and healthy
Spicy Rasam

మ‌సాలా దినుసులు..

ఎండుమిర్చి- 3, ధ‌నియాలు – 3, వెల్లుల్లి రెబ్బ‌లు – 3, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, కందిప‌ప్పు – ఒక టీ స్పూన్.

స్పైసీ ర‌సం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా దినుసులు, క‌రివేపాకు కూడా వేసి బ‌ర‌క‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, మూడు గ్లాసుల నీళ్లు, ఒక చిన్న బెల్లం ముక్క వేసి క‌ల‌పాలి. త‌రువాత ర‌సాన్ని మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు మ‌రిగించాలి.

త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా స్పైసీ ర‌సం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ర‌సంతో తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఇలా ర‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Share
D

Recent Posts