వినోదం

Sr NTR Properties : ఎన్టీఆర్ ఆస్తుల చిట్టా పెద్ద‌దే.. జిల్లాకో థియేట‌ర్ క‌ట్టించారా..!

Sr NTR Properties : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి ఎన్టీ రామారావు భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న జ్ఞ‌పకాలు మాత్రం ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయాయి. నటుడిగా ఆయన ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో.. ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతకు మించి పేరు ప్రఖ్యాతలు పొందాడు. న‌టుడిగా, నిర్మాత‌గా, డైరెక్ట‌ర్‌గా ఇలా సినిమా ఇండ‌స్ట్రీకి ఆయ‌న చేసిన సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. చెన్నైలో ఉన్న‌ప్పుడే చాలా సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్ అక్క‌డ సంపాదించిన మొత్తంతో హైద‌రాబాద్ లో చాలా ప్రాప‌ర్టీస్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అవి కోట్ల‌లో ధ‌ర‌లు ప‌లుకుతున్నాయి.

అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ ని చాలా ఇష్టంతో క‌ట్టించారు. ఇక దాని ప‌రిస‌ర ప్రాంతాలు కూడా కొనుగోలు చేసి ఎన్టీఆర్ ఎస్టేట్ అని పేరు పెట్టారు. ఇక జిల్లాకొక్క థియేట‌ర్ నిర్మించాల‌ని ఎన్టీఆర్ అనుకోగా, రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం వ‌ల‌న‌ అది కుద‌ర్లేదు. మాసబ్ ట్యాంక్ లో గుట్టపై 5 ఇండిపెండెంట్ బిల్డింగ్స్ క‌ట్టించి త‌న‌ 5 గురు కొడుకుల‌కు ఇచ్చేశాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఇళ్లు.. మొద‌ట కూతురికి ఇచ్చిన ఈ ఇంటిని త‌ర్వాత లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు.

sr ntr net worth and properties value

గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూముల‌ను కొనుగోలు చేశారు ఎన్టీఆర్. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో కూడా నిర్మించ‌గా, ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్క‌డ బ‌స చేశారు. ఇక తాను సంపాదించిన‌ది అంతా 1982లో త‌న పిల్ల‌ల‌కు పంచేసి స‌న్యాసం తీసుకుంటున్నట్టు ప్ర‌క‌టించాడు. కాగా ఎన్టీఆర్ కెరీర్ లో తొలి నాళ్లలో విజయా సంస్థలో హీరో గా పనిచేశారు. అప్ప‌ట్లో ఆయనకు నెలకు 500 రూపాయల వరకు శాలరీ ఇస్తూ ఉండేవారు. ఇది కాకుండా సినిమా హిట్ అయితే ఐదు వేల రూపాయల వరకు పొందేవారు. మిగతా హీరోలు మాత్రం ఆ సమయంలో కేవలం రెండు నుంచి మూడు వందల రూపాయలు మాత్రమే నెలకు సంపాదించే వారు. ఖ‌ర్చు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నందు వ‌ల్ల‌నే ఎన్టీఆర్ అంత కూడ‌బెట్టారు.

Admin

Recent Posts