Sweet Corn Pakoda : స్వీట్ కార్న్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ ను నేరుగా ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్వీట్ కార్న్ తో రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో స్వీట్ కార్న్ ప‌కోడి కూడా ఒక‌టి. ఈ ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా వీటిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేయ‌వ‌చ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే స్వీట్ కార్న్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, వేడి నూనె – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Sweet Corn Pakoda recipe in telugu make in this method
Sweet Corn Pakoda

స్వీట్ కార్న్ ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా స్వీట్ కార్న్ గింజ‌ల‌ను జార్ లో వేసి పల్స్ ఇస్తూ అర నిమిషం పాటు మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని ప‌కోడి పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక చేతికి త‌డి చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ప‌కోడీలా వేసుకోవాలి. వీటిని వెంట‌నే క‌దిలియ్య‌కుండా ఒక నిమిషం పాటు కాలిన త‌రువాత గంటెతో అటూ ఇటూ క‌దుపుతూ వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే నూనెలో ప‌చ్చిమిర్చిని వేసి వేయించి ప‌కోడీల‌లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ ప‌కోడా త‌యార‌వుతుంది. వీటిని వేడి వేడిగా ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి.

Share
D

Recent Posts