ఆధ్యాత్మికం

నంది లేని శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు అన్నింటిని కూల్చి వేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు కాశీ విశ్వేశ్వర ఆలయంపై దండెత్తడంతో ఆలయ పూజారి గర్భగుడిలో ఉన్న స్వామివారి లింగాన్ని తీసుకుని పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు ఆలయ సగభాగాన్ని కూల్చివేశాడు. అయితే అప్పటికే స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టాడు.

this is where lord shiva temple have no nandi

ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని పక్కనే నిర్మించి బావిలో ఉన్న విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ విధంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు లేడు. కానీ పాత ఆలయంలో మాత్రం మనకు నంది దర్శనమిస్తుంది. ఈ విధంగా స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకున్న వారు పాత ఆలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా స్వామివారి లింగం బావిలో ఉందని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ బావికి కూడా పూజలు చేస్తారు.

Admin