Tirumala Vada Prasadam : తిరుమల వడ.. తిరుమల స్వామి వారికి నైవేథ్యంగా సమర్పించే వాటిలో ఇది కూడా ఒకటి. ఈ తిరుమల వడను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఇది తిరుమలల్లో వచ్చిన రుచి మాత్రం రాదు. పొట్టు మినుములతో చేసే ఈ వడలు చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఇవి 3 నుండి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ తిరుమల వడలను తయారు చేయడం చాలా సులభం. శ్రీవారికి నైవేథ్యంగా సమర్పించే ఈ తిరుమల వడలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినుములు – అరకిలో, మిరియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
తిరుమల వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినుములను తీసుకోవాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి తగినన్ని తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మినుములను జార్ లో వేసి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక రోట్లో మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత ఈ మిరియాల పొడిని పిండిలో వేసి కలపాలి. తరువాత పిండిని తీసుకుని తడి వస్త్రంపై వేసి వడలాగా వత్తుకోవాలి. చేతులకు తడి చేసుకుంటూ వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత ఈ వడలను వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని చిన్న మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ వడలు కాలడానికి 12నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. ఇలా చేయడం వల్ల తిరుమల వడలు తయారవుతాయి. ఇవి 4 రోజలు పాటు నిల్వ ఉంటాయి. ఇలా తయారు చేసిన తిరుమల వడలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.