Tomato Pickle : మిక్సీ, రోలుతో ప‌నిలేదు.. ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Pickle : మ‌నం ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ంఉటాం. వాటిల్లో ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో పాటు ఈ నాఇల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ తింటారు. అయితే ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది. ట‌మాటాలను మిక్సీ ప‌ట్టే ప‌ని లేకుండా రుబ్బే ప‌ని లేకుండా కూడా మ‌నం ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి మ‌ధ్య మ‌ధ్య‌లో ట‌మాట ముక్క‌లు త‌గులుతూ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. సుల‌భంగా, రుచిగా ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – అర‌కిలో, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 15, ఎండుమిర్చి – 4, మెంతి పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Tomato Pickle recipe very easy to make and tasty
Tomato Pickle

ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత‌పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాట ముక్క‌లను మెత్త‌గా ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత ఇందులో ప‌సుపు, కారం, ఉప్పు, మెంతిపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత మ‌రోసారి అంతా కలుపుకుని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.

Share
D

Recent Posts