Tribal Style Chicken Curry : మ‌సాలా లేకుండా ట్రైబ‌ల్ స్టైల్‌లో చికెన్‌ను ఇలా క‌ర్రీ చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tribal Style Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ క‌ర్రీ ఉండాల్సిందే. అన్నం, చ‌పాతీ వంటి తింటే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం వివిధ ప‌ద్ద‌తుల్లో చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే ప‌ద్ద‌తిలో త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా వెరైటీగా ఈ చికెన్ కర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఎటువంటి మ‌సాలాలు వేయ‌కుండా ట్రైబ‌ల్ స్టైల్ లో చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలాసుల‌భం. ట్రైబ‌ల్ స్టైల్ లో చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రైబ‌ల్ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ముప్పావు కిలో, ఉప్పు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – అర క‌ప్పు. త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కారం – 3 స్పూన్స్.

Tribal Style Chicken Curry recipe in telugu very tasty easy to make
Tribal Style Chicken Curry

ట్రైబ‌ల్ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లో ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మామిడి ఆకుల‌ను తీసుకుని పుల్ల‌ల స‌హాయంతో విస్తరాకులా త‌యారు చేసుకోవాలి. ఇప్పుడు జ‌ల్లిగిన్నెలో ఈ మామిడి ఆకుల‌ను ఉంచి అందులో చికెన్ ను వేసుకోవాలి.త‌రువాత వీటిపై మ‌రిన్ని మామిడి ఆకుల‌ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు మ‌ట్టి కుండ‌లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత కారం, అర టీ స్పూన్ ప‌సుపు వేసి క‌ల‌పాలి.త‌రువాత ఉడికించిన చికెన్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి క‌రివేపాకు, కొత్తిమీర వేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి మ‌సాలాలు వేయ‌కుండా కూడా ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts