ఈ ఫేస్ మాస్క్‌ల‌ను ట్రై చేయండి.. చ‌ర్మంపై ఉండే జిడ్డు, మ‌చ్చ‌లు పోయి అందంగా మారుతుంది..!

మ‌న‌లో చాలా మంది త‌రుచూ జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి స‌మ‌స్యలు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే చ‌ర్మంపై మురికి, దుమ్ము వంటివి ఎక్కువ‌గా పేరుకుపోతూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా, నీర‌సంగా క‌నిపిస్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి స‌బ్బుల‌ను, స్క్ర‌బ‌ర్ ల‌ను, వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఖర్చు త‌ప్ప ఎటువంటి ఫ‌లితం ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల ఫేస్ ప్యాక్ ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా చ‌ర్మంపై ఉండే జిడ్డును తొల‌గించుకోవ‌చ్చు. ఈ ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. చ‌ర్మంపై ఉండే జిడ్డును తొల‌గించే ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జిడ్డు చ‌ర్మాన్ని అందంగామార్చ‌డంలో కోడిగుడ్డు తెల్ల‌సొన మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను వేసి నురుగా వ‌చ్చే వ‌ర‌కు బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సాన్ని కొన్ని చుక్క‌లు మోతాదులో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. క‌ళ్ల చుట్టూ , క‌నుబొమ్మ‌ల చుట్టూ వ‌దిలేసి ఈ మ‌శ్ర‌మాన్ని రాసుకోవాలి. దీనిని ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఉండే జిడ్డు తొలిగిపోతుంది. అలాగే ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ గంధం పొడి, అర టీ స్పూన్ ప‌సుపు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి.

try these face packs for facial glow and dark spots

ఇలా వారానికి ఒకసారి చేయ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా ఒక గిన్నెలో వంట‌సోడాను తీసుకుని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని ఒక నిమిషం పాటు మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే జిడ్డుతో పాటు మొటిమల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఇక జిడ్డు చ‌ర్మాన్ని అందంగా మార్చ‌డంలో క‌ల‌బంద గుజ్జు కూడా మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఒక గిన్నెలో క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం, ట‌మాట గుజ్జు వేసి క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో జెలెటిన్ పౌడ‌ర్ ను తీసుకోవాలి.

ఇందులో నిమ్మ‌రసం వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత క‌డిగి వేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇక ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, పెరుగు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts