Vaccine And Heart Attack : వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్లే హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయా.. నిపుణులు ఏమంటున్నారు..?

Vaccine And Heart Attack : ప్ర‌స్తుత కాలంలో హార్ట్ ఎటాక్ స‌మ‌స్య‌తో అర్థాంత‌రంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప‌ని చేస్తున్న వారు చేస్తున్న‌ట్టే కుప్ప‌కూలిపోతున్నారు. ఎందుకు చ‌నిపోతున్నారో తెలియ‌కుండానే చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. ఇలా చ‌నిపోయే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. అస‌లు ఎందుకు ఇలా మ‌ర‌ణిస్తున్నారు.. దీనికి వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి.. వైద్యులు ఏమంటున్నారు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ‌ధ్య కాలంలో హార్ట్ ఎటాక్ వ‌ల్ల యువ‌తే ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తున్నారు. ర‌క్త‌నాళాల్లో అప్ప‌టిక‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ‌కట్టుకుపోవ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్ వ‌చ్చి ప్రాణాల‌ను కోల్పోతున్నారు.

ఇలా గుండెపోటు రాగానే మూడు నిమిషాల వ్య‌వ‌ధిలోనే షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి త‌గిన ప్ర‌థ‌మ చికిత్స చేయ‌డం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవ‌చ్చు. ఇలా అప్ప‌టిక‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ధూమ‌పానం చేసే వారిలో అలాగే మాద‌క ద్ర‌వ్యాలు, మత్తు ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకునే వారిలో ఇలా జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్ర‌స్తుత కాలంలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఇలా గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణిస్తున్నార‌ని అనేక వార్తలు పుకార్లు చేస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ అపోహాలు మాత్ర‌మేనని నిపుణులు చెబుతున్నారు. క‌రోనా వచ్చిన త‌గ్గిన త‌రువాతఆరు వారాల నుండి మూడు నెల‌ల వ‌ర‌కు మాత్ర‌మే దాని ప్ర‌భావం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Vaccine And Heart Attack what is the relation is it true
Vaccine And Heart Attack

అలాగే కోవి షీల్డ్, కోవ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా దాని ప్ర‌భావం మూడు నెల‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెల‌ల త‌రువాత గుండెపోటు వ‌స్తే అది వ్యాక్సిన్ వ‌ల్ల లేదా క‌రోనా వ‌ల్ల వ‌చ్చే గుండెపోటు కాద‌ని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. గుండెపోటు రావ‌డానికి ముందు మ‌న శ‌రీరంలో కొన్ని సూచ‌న‌లు క‌నిపిస్తాయి. చాలా మంది వీటిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల ప్రాణాల‌ను కోల్పోతున్నారు. గుండెపోటు వ‌చ్చే ముందు న‌డుస్తుంటే ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే భుజాలు లాగుతూ ఉంటాయి. అలాగే ఛాతిలో నొప్పి, ఛాతిలో మంట, గొంతు నొప్పి వంటివి కూడా వ‌స్తూ ఉంటాయి.

చాలా మంది ఛాతిలో మంట‌ను, నొప్పిని గ్యాస్ స‌మ‌స్య‌గా భావిస్తూ ఉంటారు. ఛాతిలో నొప్పి వ‌చ్చిన ప్ర‌తిసారి గ్యాస్ స‌మ‌స్య‌గా భావించ‌వ‌ద్ద‌ని వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే వంశపార‌ప‌ర్యంగా కూడా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అలాంటి అవ‌కాశం ఉన్న వారు ముందుగానే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ గురించి ఎటువంటి అపోహలు క‌లిగి ఉండ‌వ‌ద్ద‌ని త‌గిన‌జాగ్ర‌త్త‌లు తీసుకోవడం వ‌ల్ల మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts