Vankaya Vellulli Fry : వంకాయ వెల్లుల్లి ఫ్రై.. త‌యారీ ఇలా.. అన్నంలో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Vankaya Vellulli Fry : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ ఫ్రై కూడా ఒక‌టి. వంకాయ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వంకాయ ఫ్రైను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం కూడా సుల‌భం. వెల్లుల్లి కారం వేసి మ‌రింత రుచిగా వంకాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ వెల్లుల్లి ఫ్రై త‌యారీకి కావల్పిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – పావు కిలో, ఎండుమిర్చి – 10, ప‌సుపు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఉప్పు – త‌గినంత‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఎండు కొబ్బ‌రి ముక్క – చిన్న‌ది ఒక‌టి, నూనె – రెండు టేబుల్ స్పూన్స్.

Vankaya Vellulli Fry recipe in telugu make in this method
Vankaya Vellulli Fry

వంకాయ వెల్లుల్ల ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను త‌రిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత జార్ లో ఎండుమిర్చి, ఎండు కొబ్బ‌రి, వెల్లుల్లి రెబ్బ‌లు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వంకాయ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌రివేపాకు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మూత తీసి వంకాయ ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి.

వంకాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లపాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వెల్లుల్లి ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts