Alasanda Vadalu : అల‌సంద‌ల‌తో ఎంతో క్రిస్పీగా.. రుచిగా.. ఇలా వ‌డ‌ల‌ను చేసుకోవ‌చ్చు..!

Alasanda Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. అల‌సంద‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో కూర‌, గుగ్గిళ్లు వంటివే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో వ‌డ‌ల‌ను తేలిక‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల‌సంద‌ల వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అల‌సంద‌లు – ఒక‌టిన్న‌ర కప్పులు, ప‌చ్చిమిర్చి – 4 లేదా కారానికి త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క్యారెట్ తురుము – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Alasanda Vadalu recipe in telugu make in this way
Alasanda Vadalu

అల‌సంద‌ల వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అల‌సంద‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 నుండి 7 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని మ‌రోసారి శుభ్రంగా క‌డిగి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ప‌చ్చిమిర్చిని కూడా వేసి కచ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా అల‌సంద‌ల మిశ్ర‌మాన్ని తీసుకుని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వ‌డ‌లు మ‌రీ ప‌లుచ‌గా కాకుండా చూసుకోవాలి. త‌రువాత వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల‌సంద‌ల గారెలు త‌యారవుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా అల‌సంద‌ల‌తో వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts