Vellulli Karam Borugulu : మ‌ర‌మ‌రాల‌తో వెల్లుల్లి కారం బొరుగుల‌ను ఇలా చేయండి.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Vellulli Karam Borugulu : మ‌నం సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సాయంత్రం స‌మయంలో ఇలా స్నాక్స్ గా తిన‌డానికి మ‌నం బొరుగుల‌ను (మ‌ర‌మ‌రాలు) కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. బొరుగులు బ‌రువు త‌గ్గ‌డంలో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. బొరుగుల‌తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చాలా సులువుగా, చాలా త‌క్కువ సమ‌యంలో, ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Vellulli Karam Borugulu very healthy and easy to make
Vellulli Karam Borugulu

వెల్లుల్లి కారం బొరుగుల‌ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బొరుగులు – 50 గ్రా., వెల్లుల్లి రెబ్బ‌లు – 10, కారం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, ఎండు మిర్చి – 2, పుట్నాల ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా.

వెల్లుల్లి కారం బొరుగుల‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, కారం వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక మ‌ధ్య‌స్థ మంట‌పై ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప ప‌ప్పు, ప‌ల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కచ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చి మిర్చి, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఆ త‌రువాత పుట్నాల ప‌ప్పు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ప‌సుపు వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న వెల్లుల్లి కారం, రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. చివ‌ర‌గా బొరుగుల‌ను వేసి క‌లిపి, 2 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వీటిలో త‌రిగిన కొత్తిమీర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా ముక్క‌లు, నిమ్మర‌సాన్ని కూడా వేసుకుని తిన‌వ‌చ్చు. ఇక‌ సాయంత్రం స‌మ‌యంలో బ‌య‌ట దొరికే వాటిని తిన‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా బొరుగుల‌తో ఈ విధంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో రుచి.. ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి.

D

Recent Posts