politics

త్వ‌ర‌లోనే మంత్రి కానున్న నాగ‌బాబు.. ముహుర్తం ఖ‌రారు..?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌న‌సేన కార్య‌క‌లాపాల్లో యాక్టివ్‌గా ఉన్న విష‌యం విదిత‌మే. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్ జ‌న‌సేన పార్టీని స్థాపించిన నాటి నుంచి నాగ‌బాబు అందులో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ లో జ‌డ్జిగా ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌నుల నిమిత్తం అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లో ప‌నిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌నను మంత్రి ప‌ద‌వి వరించింది. ఈ మేర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న అసెంబ్లీ స్థానాల ప్ర‌కారం 25 మందిని మంత్రులుగా నియ‌మించ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుతం కేబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. దీంతో ఒక మంత్రి ప‌ద‌వికి అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఆ మంత్రి ప‌ద‌విని జ‌న‌సేన‌కు కేటాయించింది. ఈ మేర‌కు చ‌ర్చించారు కూడా. దీంతో ఆ ప‌ద‌విని నాగ‌బాబుకు ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే నాగ‌బాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు క‌నుక మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన 6 నెల‌ల్లోపు ఏదో ఒక‌టి అయి తీరాల్సి ఉంటుంది.

very soon nagababu to become minister

ఈ క్ర‌మంలోనే ఏపీలో మ‌రో 4 నెల‌ల్లో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్నారు. అయితే దీనికి నాగ‌బాబును ఎంపిక చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు ఎమ్మెల్సీ అవ‌నున్నారు. అయితే నాగ‌బాబుకు ఏ శాఖ కేటాయిస్తారు అన్న విష‌యంపై మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ త్వ‌ర‌లోనే దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. కాగా నాగ‌బాబు ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు.

Admin

Recent Posts