Village Style Chicken Curry : చికెన్ తో తయారు చేసే వివిధ రకాల వంటకాల్లో చికెన్ కర్రీ కూడా ఒకటి. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ కర్రీని ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. పచ్చి జీడిగింజలు వేసి చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చి జీడిగింజలు వేసి కూడా చికెన్ కర్రీని చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. ఈ చికెన్ కర్రీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చి గింజలు వేసి రుచిగా, కమ్మగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి జీడిగింజలు – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, నూనె – 6 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, చికెన్ -అరకిలో, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – తగినన్ని.
చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా పచ్చి జీడికాయల్లో ఉండే గింజలను తీసి గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో వేడి నీటిని పోసి గింజలపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. అలాగే ఎండు కొబ్బరి పొడిని కూడా వేయించి కళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు,కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతపెట్టి 8 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత పచ్చిజీడిగింజలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాలపాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి జీడిపప్పు లభించినప్పుడు వాటితో ఇలా వెరైటీగా చికెన్ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు.