Village Style Tomato Pappu : విలేజ్ స్టైల్‌లో ట‌మాటా ప‌ప్పును ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Village Style Tomato Pappu : మ‌న‌లో చాలా మంది ట‌మాట ప‌ప్పును ఇష్టంగా తింటారు. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ట‌మాట ప‌ప్పును వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా ఈ ట‌మాట ప‌ప్పు రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట ప‌ప్పును మ‌రింత రుచిగా విలేజ్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

విలేజ్ స్టైల్ ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, చిన్న ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సును – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Village Style Tomato Pappu recipe in telugu very tasty make like this
Village Style Tomato Pappu

విలేజ్ స్టైల్ ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ప‌ప్పును కుక్క‌ర్ లో వేసుకోవాలి. త‌రువాత పావు టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. కుక్క‌ర్ లోనే కాకుండా ఈ ప‌ప్పును గిన్నెలో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు కూడా ఉడికించుకోవ‌చ్చు. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత టమాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ఉడికించుకున్న ప‌ప్పును వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పును మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌ప్పు త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట ప‌ప్పు మ‌రింత రుచిగా ఉంటుంది. లొట్ట‌లేసుకుంటూ ఈ ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts