Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను వేయించి లేదా చిప్స్ రూపంలో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రుచిగా ఉండ‌డంతో పాటు బంగాళాదుంప‌లు త్వ‌ర‌గా ఉడుకుతాయి. వీటితో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకున్న త‌రువాత చాలా స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి ఎక్కువ‌గా వేయ‌దు. ఇలా బంగాళాదుంప‌ల‌ను తిన్న త‌రువాత ఆక‌లి వేయ‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల బంగాళాదుంప‌ల్లో 97 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల 20 నుండి 25 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. బంగాళాదుంప‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో ఇవి తేలిక‌గా జీర్ణ‌మ‌య్యి త్వ‌ర‌గా ర‌క్తంలో క‌లుస్తుంది.

దీంతో శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి ఆక‌లి త్వ‌ర‌గా వేయ‌కుండా ఉంటుంది. అదే విధంగా బంగాళాదుంప‌ల్లో పొటాటో ప్రొటినేజ్ ఇన్ హిబిట‌ర్ 2 అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌రువాత పోలిసిస్టో కైనిన్ అనే దానిని ఎక్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేస్తుంది. దీంతో మ‌న‌కు ఆక‌లి త్వ‌ర‌గా వేయ‌కుండా ఉంటుంది. పోలిసిస్టో కైనిన్ త‌క్కువ‌గా విడుద‌లైతే ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంది. బంగాళాదుంప‌లు తిన్న త‌రువాత ఆక‌లి ఎక్కువ‌గా అవ్వ‌క‌పోవ‌డానికి ఇది ఒక కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ కార‌ణాల చేత బంగాళాదుంపలు తిన్న త‌రువాత ఆక‌లి ఎక్కువ‌గా వేయకుండా ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అయితే బంగాళాదుంప‌తో చేసిన వేపుళ్ల‌ను, చిప్స్ ను తిన్న త‌రువాత కూడా ఆక‌లి వేస్తుంద‌ని క‌దా అని చాలా మంది సందేహం వ్య‌క్తం చేస్తూ ఉంటారు.

if you are taking Potatoes in fry or chips form then know this if you are taking Potatoes in fry or chips form then know this
Potatoes

అయితే దీనిని వండే తీరుపై ఆక‌లి పెర‌గ‌డం, త‌గ్గ‌డం అనే విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. వీటిని ఉడికించి కూర‌గా చేసుకుని తింటే ఆక‌లి ఎక్కువ‌గా వేయ‌కుండా ఉంటుందని అదే ఈ బంగాళాదుంప‌ల‌ను నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకున్నా, చిప్స్ రూపంలో తీసుకున్నా పోలిసిస్టో కైనిన్ ఎక్కువ‌గా విడుద‌ల అవ్వ‌దు. దీంతో ఆక‌లి త్వ‌ర‌గా వేస్తుంది. బంగాళాదుంప‌ల‌ను ఎక్కువ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద డీప్ ఫ్రై చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి త్వ‌ర‌గా వేస్తుంది. దీంతో మ‌నం ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటాము. బంగాళాదుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డానికి ఇది కూడా ఒక కార‌ణం. వీటిని ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ‌గా ఆక‌లి వేస్తుంది. క‌నుక మ‌నం ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకునే అవ‌స‌రం ఉండ‌దు. క‌నుక బంగాళాదుంప‌ల‌ను తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts