Viral Video : తమ వైపుకు వచ్చే ఏ జంతువును అయినా సరే చిరుత పులులు వేటాడుతాయి. ఎలాంటి జంతువును అయినా సరే వేటాడడంలో చిరుత పులులు వాటికవే సాటి. అవి జింకలు, తాబేళ్లు, చేపలు, పక్షులు, కోతులు వంటి అనేక రకాల జీవాలను వేటాడగలవు. ఈ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ చిరుతపులి తన కంట పడిన ఓ కొండ చిలువను సైతం వేటాడింది.
ఓ చోట నదిలో నీళ్లు తాగుతున్న చిరుత పులి అటుగా వచ్చిన కొండ చిలువను చూసి అమాంతం దానిపై దాడి చేసింది. కానీ అది మొదట తప్పించుకుంది. అయితే చివరకు ఆ కొండ చిలువను తన పదునైన దంతాలతో ఆ చిరుత పట్టేసింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
చిరుత పులుల దంతాలు సహజంగానే చాలా పదునుగా ఉంటాయి. మొసళ్ల చర్మంలోకి సైతం అవి ప్రవేశించగలవు. అందువల్లే కొండ చిలువను ఆ చిరుత సులభంగా వేటాడగలిగింది. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 12వేలకు పైగా లైక్స్ వచ్చి.. వైరల్ అవుతోంది.