ఆధ్యాత్మికం

Red Colour Clothes : ఎరుపు రంగు దుస్తుల‌ను వారంలో ఈ ఒక్క రోజు ధ‌రించండి.. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి..!

Red Colour Clothes : తెలుగు వారాలలో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తూ సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతంలో భానువారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆది వారాన్ని సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.

ఆదివారం ఉదయాన్నే సూర్య స్త్రోత్రం పఠించడంతోపాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిది. సూర్య స్తోత్రం తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఎరుపు రంగు పువ్వుల‌ను స్వామికి సమర్పించడం ఉత్తమమని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆదివారం రోజు స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు రంగు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని చెబుతున్నారు.

wear red color dress once in a week

అదేవిధంగా ఆదివారం ఎరుపు రంగు దుస్తుల‌ను ధరించడం శ్రేష్టమని నిపుణులు అంటున్నారు. భానువారం రోజున‌ సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసిన‌ వంటకాలు.. చపాతీ, పూరీ త‌దిత‌రాలను ఆదివారం రోజు భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం ఇలా చేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. క‌నుక ఆదివారం రోజు ఇలా చేస్తే అన్ని విధాలుగా మేలు పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts