lifestyle

ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది..? ఇన్ని సమస్యలా..?

ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇది వరకు ప్రతి ఒక్కరు కూడా చీరలని కట్టుకునేవారు పెళ్లయిన తర్వాత చీరలు, పెళ్లికి ముందు లంగా వోణీలు ధరించేవారు. ఆ తర్వాత రాను రాను చుడీదార్లు వచ్చాయి. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నైటీలని వేసుకుంటున్నారు మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకి చాలా విలువ ఉంది. నిజానికి మన సాంప్రదాయం మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాయి.

అందుకనే విదేశీయులు కూడా మన ఆచారం పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక్కడ పద్ధతుల్ని పాటించడానికి ఇష్టపడతారు. అయితే మన దేశ సంప్రదాయాల్లో మార్పులు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా నైటీలనే వేసుకుంటున్నారు నిజానికి నైటీ కేవలం రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి ఆ పేరులోనే ఉంది. కానీ కంఫర్ట్ గా ఉంటుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీలని వేసుకుంటున్నారు రాత్రి వేసుకొని ఉదయం మార్చుకుంటే పర్వాలేదు కానీ బయటకి కూడా చాలామంది నైటీలతో వెళ్ళిపోతున్నారు.

what happens if women wear nighties in home

నిజానికి ఇలాంటి సంప్రదాయాలు అసలు మంచివి కాదు చక్కగా చీర కట్టుకుంటే అందంగా కనపడతారు. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి లాగ కనపడతారు కానీ అలాంటి మహిళలందరూ నైటీతోనే కాలాన్ని గడుపుతున్నారు. చీర కట్టుకుంటే చాలా అందంగా కనబడతారు పైగా అది మన సాంప్రదాయం. ఎంత లక్షణంగా మహిళ కనపడుతుంది..? పైగా చీర కట్టుకుని ఆడవాళ్లను చూస్తే చేతులు తిరిగి నమస్కరించాలని అనిపిస్తుంది.

కానీ నైటీలో కనబడితే అలా అనిపించదు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే చాలా చక్కగా ఉంటుంది. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే ఏమైనా అందంగా ఉంటుందా..? రాత్రి కాకుండా ప‌గ‌లంతా కూడా నైటీ వేసుకోవ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం తెప్పించిన‌ట్లు అవుతుంద‌ట‌. క‌నుక ఈ విష‌యంలో మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Admin

Recent Posts