ఆధ్యాత్మికం

Crying Before God : దేవుడి ముందు ఏడిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Crying Before God : దేవుడిని మనం మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. మనకి ఏదో తెలియని బలం, శక్తి వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మనం అనుకుని, దానికి తగ్గట్టుగా మనం కష్టపడినా ఫలితం రాకపోతే దేవుడికి దండం పెట్టుకుని, మన బాధల్ని, మన కోరికల్ని చెప్పుకుంటూ ఉంటాము. అలా భగవంతుడికి చెప్తే, భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడ‌ని మన నమ్మకం. అయితే కొందరు భగవంతుడితో మాట్లాడేటప్పుడు, భగవంతుడికి వారి కోరికలను చెప్పేటప్పుడు, ఏడ్చేస్తూ ఉంటారు.

వాళ్ళకి కూడా తెలియకుండా భగవంతుణ్ణి మొక్కుతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఎందుకు అలా ఏడుస్తారు అనే విషయానికి వచ్చేస్తే.. ఎప్పుడైనా సరే ఏదైనా భావోద్వేగం ఎక్కువైతే కళ్ళంట తెలియకుండానే నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. మనిషి బాధని అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించలేడు. ఒక్క సారి బాధ కలిగితే, మనకి 100 సార్లు అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏదైనా బాధ మనకి వచ్చిందంటే, అది ఎన్నో ఏళ్ళు మనకి గుర్తుండిపోతుంది.

what happens if you cry before god

ఆనందాన్ని గుర్తు పెట్టుకున్నంత బాగా మనం బాధని అయితే గుర్తుపెట్టుకోలేము. వేరొక మనిషి దగ్గర మనం ఏడిస్తే, వాళ్ళు మన ఏడుపునే గుర్తు పెట్టుకుంటారని, వాళ్ళ ముందు మనం చులకన అయిపోయామని మనం ఏడవము. ఎటువంటి కష్టమైనా దేవుడికి చెప్పుకొని, ఏడుస్తూ ఉంటాము. ఇదొక కారణం కూడా. అలానే మన బాధల్ని మనం ఇతరులకి చెప్పడం వలన ఉపయోగం అయితే ఏమీ లేదు.

మన బాధని మనం మరొకరికి చెప్తే వాళ్లు ఏమీ తీర్చలేరు. కాబట్టి చెప్పుకోకుండా ఉండడమే మంచిది. అందుకే మన కష్టాలని, మన బాధల్ని దేవుడికి చెప్పుకోవడమే మంచిది. భగవంతుడు ముందు అందుకే చాలా మంది ఏడ్చి, వారి కష్టాలని చెప్పుకుంటారు. దేవుడికి చెప్పుకోవడం వలన మనకి కాస్త భారం తగ్గుతుంది. అలానే దేవుడికి చెప్పుకోవడం వలన అది తీరొచ్చు. తీరకపోవచ్చు. కానీ మనకి దానిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.

Admin

Recent Posts