information

డెబిట్ కార్డుపై ఉన్న 16 డిజిట్స్ కి అర్ధం ఏమిటి..? ఓహో ఇందుకా ఈ నెంబర్లు..?

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో అన్ని ఈజీ అయిపోయాయి. డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళక్కర్లేకుండా, డెబిట్ కార్డు సహాయంతో మనం ఏటీఎంలో నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ని ఏటీఎం కార్డ్ అని కూడా అంటారు. ఏదైనా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోగించడమే కాదు. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిల్లు చెల్లింపులకు కూడా వాడొచ్చు. అయితే డెబిట్ కార్డ్ ని గమనించినట్లయితే దాని మీద మొత్తం 16 అంకెలు ఉంటాయి. అయితే ఆ 16 అంకెలకి అర్థం ఏంటి..? ఎందుకు అంకెల్ని వేస్తారు అనే దాని గురించి చూద్దాం.

ఈ 16 అంకెల్లో మొదటి ఆరు అంకెలు బ్యాంకు గుర్తింపు సంఖ్య. మిగిలిన 10 అంకెలు కార్డ్ హోల్డర్ యొక్క ప్రత్యేక ఖాతా సంఖ్య. డెబిట్ కార్డు పై ముద్రించిన గ్లోబల్ హోలోగ్రామ్ కూడా ఒక రకమైన సెక్యూరిటీ హోలోగ్రామ్. అయితే దీన్ని తీసేయడం కష్టం. త్రీ డైమెన్షనల్ ఇది.

what is the meaning of 16 digits on debit card

గడువు ముగిసిన తేదీ, సంవత్సరం కూడా డెబిట్ కార్డ్ పై రాస్తారు. తద్వారా తేదీ తర్వాత డెబిట్ కార్డ్ పనిచేయదని.. ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవ్వదని గుర్తించుకోవాలి. కార్డు పై ఉన్న ఆఖరి నెంబర్ డిజిట్ చెక్ సమ్ డిజిట్. ఇది కార్డు వ్యాలీడ్ కాదా అనేది తెలుపుతుంది. ఇలా డెబిట్ కార్డు పై ఉన్న అంకెలకి అర్థమైతే ఇది. ఈసారి మీ కార్డు ని గమనిస్తే మీకు అర్థం అయిపోతుంది.

Peddinti Sravya

Recent Posts