Whatsapp : వాట్సాప్‌లో వ‌చ్చిన అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఇక‌పై 4 డివైస్‌ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు..!

Whatsapp : ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఓ అద్భుత‌మైన ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్ పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు ప్ర‌స్తుతం ల‌భిస్తోంది. ఎంతో కాలగా ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తోంది. అందువ‌ల్ల కేవలం బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. దీంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారులు ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

Whatsapp multi device support now available to all users
Whatsapp

వాట్సాప్‌లో వ‌చ్చిన మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఏకంగా 4 డివైస్‌ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. లాగౌట్ అవ్వాల్సిన ప‌నిలేదు. కంప్యూట‌ర్‌, ట్యాబ్‌, ఫోన్‌.. ఇలా 4 ర‌కాల డివైస్‌ల‌లో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను వాడుకోవ‌చ్చు. అయితే ఫోన్ గ‌నుక 14 రోజుల పాటు ఇనాక్టివ్‌గా ఉంటే.. అంటే.. వాట్సాప్‌ను వాడ‌క‌పోతే.. అప్పుడు ఆ నాలుగు డివైస్‌లు లాగవుట్ అవుతాయి. త‌రువాత మ‌ళ్లీ వాటిని లింక్ చేసి క‌నెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవాలంటే.. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఎందులో అయినా స‌రే ముందుగా వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాలి. త‌రువాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో అయితే వాట్సాప్‌ను ఓపెన్ చేశాక పై భాగంలో ఉండే మూడు చుక్క‌ల మెనూను ఓపెన్ చేయాలి. అందులో లింక్డ్ డివైసెస్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత తెర‌పై క‌నిపించే స్టెప్స్‌ను ఫాలో కావాలి. దీంతో ఆ వాట్సాప్ అకౌంట్‌కు 4 డివైస్‌ల‌ను క‌నెక్ట్ చేసి ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక ఐఓఎస్‌లో అయితే వాట్సాప్‌ను ఓపెన్ చేశాక అందులో ఉండే సెట్టింగ్స్ అనే ఐకాన్‌పై ట్యాప్ చేసి లింక్డ్ డివైసెస్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత స్క్రీన్‌పై క‌నిపించే స్టెప్స్‌ను ఫాలో కావాలి. దీంతో డివైస్‌ల‌ను లింక్ చేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇలా ఒకే వాట్సాప్ అకౌంట్‌ను నాలుగు డివైస్‌ల‌కు లింక్ చేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ వెబ్‌లోనూ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ ఫీచ‌ర్‌ను వాడుకుంటే కొన్ని ఇత‌ర ఫీచ‌ర్లు ప‌నిచేయ‌వు.

మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్‌ను వాడితే కొన్ని ర‌కాల ఫీచ‌ర్లు యూజర్ల‌కు ల‌భించ‌వు. బ్రాడ్ కాస్ట్ లిస్ట్‌ల‌ను క్రియేట్ చేయ‌లేరు, చూడ‌లేరు. అలాగే లింక్ ప్రివ్యూలు రావు. ఇక ఐఫోన్‌లో ఈ ఫీచ‌ర్‌ను వాడితే యూజ‌ర్లు చాట్‌ల‌ను డిలీట్ చేయ‌లేరు. అలాగే ఈ ఫీచ‌ర్‌ను వాడితే పాత వాట్సాప్ వెర్షన్ ను ఉప‌యోగించే ఫోన్స్‌కు వాయిస్ కాల్స్ చేయ‌లేరు. మెసేజ్‌ల‌ను పంప‌లేరు. ఇలా మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్‌ను వాడుకోవాల్సి ఉంటుంది.

Editor

Recent Posts