Chappals : కొంతమంది దుస్తులు కి మ్యాచ్ అయ్యే చెప్పులని ధరిస్తూ ఉంటే, కొందరు మాత్రం ఏ రంగు చెప్పులని కొనుగోలు చేస్తున్నాం అనేది కూడా చూసుకోకుండా కొంటూ ఉంటారు. రెండూ తప్పే. చెప్పులు విషయంలో కూడా పొరపాట్లు చేయకూడదని, జ్యోతిష్య శాస్త్రం అంటోంది. ఈ రంగు చెప్పులు వేసుకోవడం వలన దురదృష్టం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎలాంటి తప్పులు చేయకూడదనేది చూసేద్దాం.
పసుపు రంగు మంచిదే. కానీ పసుపు రంగు చెప్పులను కానీ షూ ని కానీ ఎప్పుడూ కొనుగోలు చేయకండి. పసుపు రంగు బృహస్పతి రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు కలిగిన షూ, చెప్పులు వంటివి వేసుకుంటే బృహస్పతి బలహీన పడుతుందని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. పిల్లలు, పెళ్లి, వివాహ జీవితానికి ఇబ్బందులు వంటివి ఈ తప్పు చేయడం వలన కలుగుతాయి. కాబట్టి ఈ తప్పుని అసలు చేయకుండా చూసుకోండి. బృహస్పతి కోపాన్ని ఎదుర్కొనే వారి జీవితంలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. ప్రశాంతంగా ఎప్పుడూ నిద్ర పోలేరు.
పసుపు రంగు చెప్పులు లేదా బూట్లు ఎప్పుడూ కొనకండి. వేసుకోకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీలం రంగు, నలుపు రంగు బూట్లు, చెప్పులు వేసుకుంటే మంచి జరుగుతుంది. తెలుపు రంగు చెప్పులు, బూట్లు కూడా వేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ కూడా చెప్పులను ఎవరైనా బహుమతిగా ఇస్తే వాటిని వాడకండి. అలా తీసుకుని వేసుకోవడం వలన జీవితంలో సమస్యలు ఎక్కువవుతాయి.