హెల్త్ టిప్స్

Walnuts : రోజూ వాల్ న‌ట్స్ ని తింటున్నారా..? ఈ పొరపాట్ల‌ని మాత్రం అస్సలు చేయకండి..!

Walnuts : చాలా మంది ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. బాదం, జీడిపప్పు, వాల్ న‌ట్స్ మొదలైనవి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు బాగుంటుంది. అదే విధంగా వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ లానే వాల్ న‌ట్స్ మంచి కొవ్వు పదార్థాలని కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు మనకి లభిస్తాయి. విటమిన్స్, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి.

అదే విధంగా ఫైబర్, ఒమేగా త్రీ, సెలీనియం, క్యాల్షియం మొదలైన పోషకాలను మనం పొందవచ్చు. వాల్ న‌ట్స్ తీసుకుంటే, హృదయ సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు అని స్టడీ చెప్తోంది. ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వలన రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని అవయవాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలానే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

if you are eating walnuts daily then do not make these mistakes

చెడు కొలెస్ట్రాల్ ని కూడా ఇవి తగ్గించేస్తాయి. వాల్ న‌ట్స్ లో ఉండే పాలీఫెనోల్స్ రసాయనిక ప్రేరిత కాలేయ వ్యాధుల‌ను నివారించడానికి సహాయం చేస్తాయి. వాల్ న‌ట్స్ ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా మనం వీటిని తీసుకొని పెంచుకోవచ్చు. షుగర్ ని కూడా ఇది తగ్గిస్తాయి.

బరువు కూడా తగ్గడానికి అవుతుంది. ఇలా అనేక లాభాలను మనం వాల్ న‌ట్స్ ని తీసుకొని పొందవచ్చు. అయితే వీటిని తీసుకుంటే క‌చ్చితంగా పలు సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాలి. కొంతమందిలో ఎలర్జీ వంటివి వస్తాయి. వాల్ న‌ట్స్ ని తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి. అధికంగా వీటిని తీసుకోవడం వలన ఎలర్జీలతో పాటు నాలుక వాపు, గొంతు వాపు వంటివి కూడా కలగొచ్చు. క‌నుక ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వీటిని తిన‌రాదు. ఇక వీటిని రోజుకు 5 లేదా 6 చొప్పున నాన‌బెట్టి తింటే మంచిది.

Admin

Recent Posts