ఆధ్యాత్మికం

Lord Ganesha : తొండం ఎటువైపు ఉన్న వినాయకుడిని పూజిస్తే మంచిది..?

Lord Ganesha : మనం మొదట ఏ పూజ చేయాలన్నా కూడా వినాయకుడిని మొదట పూజిస్తాం. ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళకి పూజలు చేస్తాం. వినాయకుడిని మొదట మనం పూజిస్తే, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండకుండా మనం అనుకున్నవి పూర్తవుతాయని వినాయకుడిని మొదట కొలుస్తాము. అయితే, ఎప్పుడూ కూడా చాలా మందిలో వుండే సందేహం ఏంటంటే, వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలి..? ఎటువైపు ఉంటే మంచిది అని.. అయితే, ఈ విషయం గురించి ఎంతో మందికి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఆ విషయాన్ని చూసేద్దాం.

కొంతమంది కుడివైపుకి తిరిగిన తొండాన్ని కలిగిన వినాయకుడిని తీసుకోవాలి అంటే, ఇంకొందరు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడు ఉండడం మంచిదని అంటుంటారు. మరి ఏది మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి తొండము ఎంతో ముఖ్యమైనది. కుడివైపుకి తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని, లక్ష్మీ గణపతి అంటారు. తొండం లోపలి వైపుకి ఉంటే, ఆ గణపతిని తపోగణపతి అంటారు.

which type of Lord Ganesha idol we have to do pooja

తొండము ముందుకు ఉంటే, ఆ గణపతికి అస్సలు పూజ చేయకూడదట. గణపతికి ఒక దంతం విరిగి ఉంటుంది. విరిగి ఉన్న దంతాన్ని చేతితో పట్టుకుని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. ఈ గణపతి కి కూడా పూజలు చేయకూడదు. గణపతి వాహనం ఎలుక. మనం పూజించేటప్పుడు, ఖచ్చితంగా వినాయకుడికి ఎలుక ఉండేటట్టు చూసుకోవాలి.

గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా చూసుకోవాలి. పూజించేటప్పుడు, గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. గణపతి ప్రతిమ చిరునవ్వు కలిగి ఉంటే, సుఖసంతోషాలు కలుగుతాయి. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డూ, ఇంకో చేతిలో కమలం, అలానే మిగిలిన చేతుల్లో శంఖము, ఆయుధము ఉండాలి. వినాయకుడికి తొండం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఇటువంటివే కొనడం మంచిది. గణేశుడికి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి వైపే, అనగా ఎడమవైపుకి ఉండాలని పండితులు అంటున్నారు.

Admin

Recent Posts