Lankeshwarudu : టాలీవుడ్లో మేటి నటుడు చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. అలా మెగాస్టార్ నటించిన లంకేశ్వరుడు సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందకు రాగా, ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. చిత్రానికి వడ్డే రమేష్ నిర్మాతగా వ్యవహరించగా, భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారు.
నిజానికి లంకేశ్వరుడు సినిమా కంటే ముందు దాసరి తన సినిమా శివరంజనిలో చిరంజీవిని హీరోగా అనుకున్నారు. కానీ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కాగా 1988 సంవత్సరం లో నవంబర్ లో లంకేశ్వరుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించగా, ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి అప్పటి స్టార్స్ శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలు అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాధను ఎంపిక చేశారు. ఇక షూటింగ్ జరుగుతున్న క్రమంలో మెగాస్టార్ దాసరి మధ్య కొన్ని గొడవలు జరిగినట్టు తెలుస్తుంది.
ఇద్దరి మధ్య ఏవో మనస్పర్దలు గొడవలకు దారి తీశాయి. దాంతో దాసరి ఏకంగా సినిమా నుండి తప్పుకున్నారు. చిరు అప్పుడు స్టార్ గా ఎదగగా దాసరి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే ఊహించని విధంగా దాసరి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో బ్యాలెన్స్ ఉన్న మిగతా మూడు సాంగ్స్‌ని దాసరి లేకుండానే చిరంజీవి పూర్తిచేశాడు. ఆ తరవాత నిర్మాత వడ్డే రమేష్ ఇద్దరినీ కలిపి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను భారీ రేటుకు అమ్మగా, సినిమా భారీ అంచనాల మధ్యన విడుదలవ్వడం…కథ కథనం సరిగా లేకపోవడంతో ఫ్లాప్ మూవీగా నిలిచింది.