ఆధ్యాత్మికం

Lord Shiva And Bilva Patra : శివుడికి అస‌లు బిల్వ ప‌త్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం.. వీటిని ఎలా స‌మ‌ర్పించాలి..?

Lord Shiva And Bilva Patra : శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం వస్తుంది. అలానే శ్రావణమాసంలో మంగళ గౌరీ నోములు నోచుకునే వారు కూడా నోచుకుంటారు. శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే శివుడికి బిల్వపత్రాలని పెట్టి పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయట. పైగా శివుడికి బిల్వపత్రాలు అంటే ఎంతో ప్రీతి. అయితే అసలు ఎందుకు శివుడికి బిల్వపత్రాలని సమర్పిస్తారు..? బిల్వపత్రాలని పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి.. అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

శివుడికి మూడు బిల్వపత్రాలని పెడతాం కదా.. అవి బ్రహ్మ, విష్ణు, శివుడు. ఇలా త్రిమూర్తులని సూచిస్తాయి. శివుడికి ఈ బిల్వ పత్రాలని పెడితే కష్టాలు తొలగిపోతాయట. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శివుని మూడవ కన్ను ప్రాముఖ్యతని ఈ మూడు ఆకులు సూచిస్తాయి. శివుడి మూడవ కన్ను గురించి ఎన్నో కథలు ఉన్నాయి. శివుడు మూడవ కన్ను తెరిస్తే, మొత్తం కాలిపోతుంది అని కూడా అంటారు.

why lord shiva likes bilva leaves

పురాణాల ప్రకారం బిల్వపత్ర చెట్టు పార్వతీ దేవి చెమట నుండి ఉద్భవించింది. బిల్వపత్రంలో పార్వతి దేవి, చెట్టు మూలల్లో గిరిజ, చెట్టు కొమ్మల్లో మహేశ్వరి వుంటారు. అలానే కాత్యాయని, గౌరీ దేవి కూడా నివసిస్తారట. బిల్వపత్ర వృక్షం స్వర్గంలో కల్పవృక్షంతో సమానమట. బిల్వపత్రాన్ని శివుడికి పెట్టేటప్పుడు, ఉంగరం వేలు, మధ్య వేలు, బొటనవేలు ఉపయోగించి పెట్టాలి.

శివుడికి జలంతో అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాన్ని పెట్టాలి. ఎప్పుడూ కూడా బిల్వపత్రం అపవిత్రం కాదు. సోమవారం బిల్వపత్ర ఆకులని తీయకూడదు. శివుడికి సమర్పించిన బిల్వపత్ర ఆకుల్ని చింపకూడదు. అలానే ఆకుల్ని తెంపేటప్పుడు ఓం నమ: శ్శివాయ అని జపిస్తూ తీయాలి. చేతులు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత మాత్రమే ఈ ఆకులని తెంపాలి. ఈ ఆకులను తెంపాక శుభ్రమైన నీటితో కడగాలి. సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణిమ, అష్టమి, నవమి నాడు ఈ ఆకులని తెంపకూడదు.

Admin

Recent Posts