వినోదం

Jaganmohini Movie : తెలుగు సినీ చ‌రిత్ర‌లో సంచ‌లనం సృష్టించిన ఈ సినిమాని ఎన్టీఆర్ ఎందుకు వ‌ద్దనుకున్నారు..?

Jaganmohini Movie : తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ స‌ప‌రేట్ పేజ్ క్రియేట్ చేసుకున్న న‌టుడు ఎన్టీఆర్. ఆ మూడు అక్ష‌రాల పేరు చెబితే తెలుగు ప్ర‌జ‌లు తెగ మురిసిపోతుంటారు. ఆ నాటి నుండి ఈ నాటి వ‌ర‌కు ఎంద‌రో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న ఎన్టీఆర్ న‌టుడిగాను, రాజ‌కీయ నాయకుడిగాను త‌నదైన శైలిలో మెప్పించారు. సినిమాల విష‌యానికి వ‌స్తే పిచ్చిపుల్ల‌య్య నుంచి శ్రీకృష్ణుడు రాముడు.. పంతులుగారు.. ఇలా అనేక వేషాలు వేశారు. అటు పౌరాణికం.. ఇటు గ్రాంథికం.. సామాజికం.. చారిత్ర‌కం, జాన‌ప‌దం అన్ని కోణాల‌ను అన్న‌గారు ట‌చ్ చేశారు.

అయితే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో జాన‌ప‌ద బ్ర‌హ్మ‌గా సువ‌ర్ణాధ్యాయం సృష్టించిన విఠాలాచార్య .. ఎన్టీఆర్ కోసం మంచి క‌థ‌ను సిద్ధం చేసుకొని ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని అనుకున్నారు. అయితే అప్ప‌ట్లో ఎన్టీఆర్ వేరే చిత్రాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న నేను చేయ‌లేన‌ని చెప్పార‌ట‌. దాంతో కోపోద్రిక్తుడైన విఠాలాచార్య అప్పుడ‌ప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్న‌న‌ర్సింహ‌రాజుతో సినిమా చేశారు. ఆ సినిమా విడుద‌ల కావ‌డం సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం జ‌రిగింది.

why sr ntr rejected jaganmohini movie

ఆ సినిమా మ‌రేదో కాదు జ‌గ‌న్మోహిని చిత్రం. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీల‌లో వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రూ చాలా ఇష్టంగా చూస్తారు. చిన్న పిల్ల‌లు సైతం ఈ మూవీని చూడ్డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇందులో ఎన్నో జిమ్మిక్కులు మ‌న‌కు క‌నిపిస్తాయి. అవన్నీ ప్రేక్ష‌కుల మెప్పు పొందాయి. కాగా, విఠ‌లాచార్య వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందంటే ఆయ‌న చిత్రంలో న‌టించే ఎవ‌ర‌యినా ఆర్టిస్టులు ఆయ‌న‌ను ఇబ్బంది పెడితే ఆ పాత్ర‌ను ముగించేలా క‌థ‌ను అల్లుకుంటారు. ఆయ‌న చిత్రాల్లో ఎక్కువ‌గా మునీశ్వ‌రులు, శాపాలు వంటివి ఉంటాయి. ఆయ‌న‌కి అవ‌స‌రం లేదు అనిపిస్తే మునీశ్వ‌రుడు శాపం పెట్టి కుక్క‌నో, మేక‌నో లేదా ఏ రాయిగానో మార్చేస్తాడు. సినిమా ముగింపు అప్పుడు మ‌ళ్ళీ శాప విముక్తి అయి ఆ పాత్ర‌కి ప్రాణం పోస్తాడు. అలాంటివి విఠాలాచార్య సినిమాలో మ‌న‌కు క‌నిపిస్తాయి. మేక‌నో లేదా ఏ రాయిగానో మార్చేస్తాడు. తిరిగి ఆ శాపం సినిమా ముగింపు అప్పుడు మ‌ళ్ళీ శాప విముక్తి అయి ఆ పాత్ర‌కి ప్రాణం పోస్తాడు. అలాంటి జిమ్మిక్కుల‌న్నీ ఒక్క విఠ‌లాచార్య సినిమాల్లోనే చూడ‌గ‌లం.

Admin

Recent Posts