ఆధ్యాత్మికం

Sri Kalahasti : శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక‌.. ఏ ఆలయాలకి వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా..?

Sri Kalahasti : శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు, శ్రీకాళహస్తి వెళ్తుంటారు, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఆలయానికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆలయాలకి కూడా వెళ్తుంటారు. పాప నాశనం, కాణిపాకం చూసి చివరగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా చూస్తారు. శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయాలకు వెళ్ళకూడదని అంటారు.

అలా వెళితే అరిష్టమని, హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పబడింది. ఎందుకు అలా వెళ్ళకూడదు..? వెళ్తే ఏమవుతుంది అనేది చూస్తే.. శ్రీకాళహస్తి కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికే వెళ్లాలి. పంచభూతాల నిలయమైన ఈ విశ్వంలో వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు తెలిసాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయు లింగం. ఇక్కడ గాలి తగిలాక ఇక ఏ దేవాలయానికి వెళ్ళకూడదు.

why you should never go to other temples after srikalahasti darshan

అది ఇక్కడ ఆచారం. అలానే శ్రీకాళహస్తి వచ్చాక సర్ఫ దోషం, రాహు కేతువుల దోషం కూడా పూర్తిగా పోతుందని అంటారు. శ్రీకాళహస్తీశ్వర లోని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటారు. ఆయన దర్శనంతో కాలసర్ప దోషం పోతుంది. దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలని వదిలేసి ఇంటికి వెళ్లాలి. అందుకే నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు. ఇక ఏ ఆలయానికి వెళ్ళినా దోషం అనేది పోదు.

పైగా గ్రహణ ప్రభావం కానీ శని ప్రభావం కానీ పరమశివుడికి ఉండవని, ఇతర దేవుళ్ళకి ఉంటాయని అంటారు. ఎక్కడైనా కూడా గ్రహణ సమయంలో ఆలయాలని మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి దేవాలయంని మాత్రం మూసి వేయరు. ఎందుకంటే అక్కడ గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి. ఇలా ఈ కారణాల వల్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ ఇతర ఆలయాలకి కూడా వెళ్లకూడదని, నేరుగా ఇంటికి వెళ్లాలని అంటారు.

Admin

Recent Posts