ఆధ్యాత్మికం

పెళ్లైన వారు పుట్టింటి నుంచి ఈ వస్తువులను అస్సలు తీసుకెళ్లకూడదు

సాధారణంగా వివాహమైన మహిళలు తమ పుట్టింటికి రావడం సర్వసాధారణమే. అయితే పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో తమ కూతురి వెంట కొన్ని వస్తువులను పంపిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత తమ కూతురికి కొన్ని వస్తువులను పంపించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే కూతురు వెంట అత్త వారి ఇంటికి పంపించకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లైన మహిళలు పుట్టింటి నుంచి పుల్లని వస్తువులను తీసుకు వెళుతుంటారు. ఈ విధంగా పుల్లని వస్తువులను తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అదేవిధంగా చేదు ఉండే వస్తువులను తీసుకోవటం వల్ల మనస్పర్థలు వస్తాయి. అందుకోసమే పుట్టింటి నుంచి ఈ రుచి కలిగిన పదార్థాలను అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.

women should not bring these items from their birth home

కొందరు పుట్టింటి నుంచి చీపురును అత్తవారింటికి తీసుకెళ్తుంటారు. ఈ విధంగా చీపురను తమతో తీసుకు వెళ్లడం వల్ల పుట్టింటి లక్ష్మీదేవిని తీసుకెళ్లినట్టని పండితులు చెబుతున్నారు. కనుక ఈ విధమైనటువంటి వస్తువులను తీసుకునేటప్పుడు ఉచితంగా కాకుండా, కొంత డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts