lifestyle

Flies : మీ ఇంట్లో ఈగ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Flies : వానా కాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో దోమలు, ఈగలు కూడా విపరీతంగా ఇంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈగల వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈగల వలన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈగల వలన కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ ఇలాంటి చాలా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శుభ్రత లేకపోతే ఈగలు ఇంట్లోకి వస్తాయి. చాలామంది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోరు. అలాంటప్పుడు ఈగలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది.

కొన్ని కొన్ని సార్లు బాగా శుభ్రం చేసినా కూడా ఇంట్లోకి ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. ఈగల బాధనుండి మీరు బయటపడాలంటే ఇలా చేయండి. ఇక ఈగలు మీ ఇంట్లోకి రావు. అల్ట్రా వయోలెట్ ట్రాప్స్ ని ఉపయోగించడం ద్వారా ఈగలు ఇంట్లో ఇబ్బంది పెట్ట‌వు. ఇంట్లో ఈ అల్ట్రా వయోలెట్ ట్రాప్‌ ని పెడితే అది ఈగల్ని బాగా ఆకర్షిస్తుంది. అలా వాటి వద్దకు వెళ్లిన ఈగలు షాక్ తో చనిపోతాయి. ఇలా ఈగల‌ని తగ్గించుకోవచ్చు.

wonderful tips to get rid of flies

కర్పూరం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ వాసనతో ఈగలు రాకుండా చేయొచ్చు. ఈగలు ఎక్కువగా ఉంటే కర్పూరంని వెలిగించండి. ఈగలు అప్పుడు చేరవు. తులసి కూడా చక్కగా పనిచేస్తుంది. తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తులసికి ఈగలను తరిమికొట్టే శక్తి కూడా ఉంది. తులసి ఆకులని, పుదీనా, లావెండర్ ఆకుల్ని కూడా మీరు ఉపయోగించవచ్చు.

డిష్ వాషింగ్ లిక్విడ్ తోపాటు కొంచెం వైట్ వైన్ కలుపుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకుని,ఇంట్లో పెట్టడం వలన ఈగలు ఆకర్షించి అందులో పడి చనిపోతాయి. ఈగలు రాకుండా ఉండడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా సహాయం చేస్తుంది. ఇంట్లో ఎక్కడైనా ఆపిల్ సైడర్ వెనిగర్ ని పెట్టండి. ఆ వాసనకి అసలు ఈగలు రావు. దాల్చిన చెక్క పొడి కూడా ఈగల‌ను రాకుండా చేస్తుంది. ఈ వాసనని అసలు ఈగలు ఇష్టపడవు. దాంతో ఈగలు రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts