Idli Rava : బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేకుండా.. ఇంట్లోనే ఇడ్లీ ర‌వ్వ‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..

Idli Rava : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా త‌యారు చేసే వాటిల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం బ‌య‌ట కొనుగోలు చేసిన ఇడ్లీ ర‌వ్వ‌ను వాడుతూ ఉంటాం. ఇడ్లీ ర‌వ్వ‌ను బ‌య‌ట కొనుగోలు చేయ‌డానికి బ‌దులుగా మ‌నం ఇంట్లో ఉండే బియ్యంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంతో ఇడ్లీ ర‌వ్వ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

you can make Idli Rava at home very simple steps
Idli Rava

ఇడ్లీ ర‌వ్వ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – అర‌కిలో, నీళ్లు – 8 గ్లాసులు, ఉప్పు – అర టీ స్పూన్.

ఇడ్లీ ర‌వ్వ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో 8 గ్లాసుల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఉప్పును వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యాన్ని వేసి ఒక నిమిషం పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. త‌రువాత ఈ బియ్యాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత బియ్యంలో నీళ్లు లేకుండా వ‌డ‌క‌ట్టాలి. ఇలా వ‌డ‌క‌ట్టిన త‌రువాత బియ్యాన్ని మ‌ర‌లా చ‌ల్ల‌టి నీళ్లు పోసి క‌డ‌గాలి. ఇలా క‌డిగిన త‌రువాత బియ్యాన్ని ఒక‌టి లేదా రెండు రోజుల పాటు బాగా ఎండ‌బెట్టాలి.

ఇలా ఎండ‌బెట్టిన త‌రువాత బియ్యాన్ని గిర్నిలో వేసి ర‌వ్వ‌లా చేసుకోవ‌చ్చు లేదా ఇంట్లోనే మిక్సీ జార్ లో వేసి ర‌వ్వ‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ర‌వ్వ‌ను జ‌ల్లించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌వ్వ‌, బియ్యం పిండి వేరు అవుతాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోనే సుల‌భంగా ఇడ్లీ ర‌వ్వ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీ ర‌వ్వ‌ను మూత ఉండే డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 4 నెల‌ల పాటు పాడ‌వ‌కుండా ఉంటుంది. ఇలా ఇంట్లో త‌యారు చేసుకున్న ఇడ్లీ ర‌వ్వ‌తో చేసిన ఇడ్లీలు మ‌రింత రుచిగా, మ‌రింత మెత్త‌గా ఉంటాయి.

D

Recent Posts