వినోదం

Magadheera : మ‌గ‌ధీర మూవీలో ఈ సీన్‌ను చూస్తే ఒక డౌట్ రావాలే.. మీకు వ‌చ్చిందా..?

Magadheera : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అనేక చిత్రాల్లో మ‌గధీర ఒక‌టి. రామ్‌చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం 30 జూలై 2009న రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రామ్ చ‌ర‌ణ్‌ను స్టార్ హీరోగా నిల‌బెట్టింది. రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ అనేక రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. అప్ప‌ట్లో ఈ మూవీ టాలీవుడ్‌లోనే ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఏకంగా రూ.150 కోట్ల‌ను క‌లెక్ట్ చేసి ఆల్ టైమ్ హై క‌లెక్ష‌న్స్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

అయితే మ‌గ‌ధీర‌లో పున‌ర్జ‌న్మ అనే అంశాన్ని చూపించారు. 400 ఏళ్ల కింద‌ట కొన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య చ‌నిపోయిన ఒక జంట.. అప్ప‌టి కొంద‌రు వ్య‌క్తులు మ‌ళ్లీ 400 ఏళ్ల త‌రువాత జ‌న్మించి అనూహ్య ప‌రిస్థితుల్లో క‌లుసుకుంటారు. దీంతో వారికి గ‌త జ‌న్మ గుర్తుకు వ‌స్తుంది. ఇక ఆ జ‌న్మ‌లో ప్రేమ విఫ‌లం అయింది క‌నుక ఈ జ‌న్మ‌లో క‌చ్చితంగా వీరు క‌ల‌వాలి అని ప్రేక్ష‌కులు కోరుకుంటారు. సినిమా మొత్తం ఇదే క‌థాంశంపై న‌డుస్తుంది. అందుక‌నే మూవీ హిట్ అయింది.

you will get this doubt after reading this about magadheera movie

అయితే మ‌గ‌ధీర్‌లో రామ్ చ‌ర‌ణ్‌, కాజల్ ఇద్ద‌రూ చేతివేళ్లు క‌ల‌వ‌గానే వారిలో విద్యుత్ లాంటిది ప్ర‌వ‌హించి వారికి పూర్వ జ‌న్మ గుర్తుకు వ‌స్తుంది. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు త‌రువాత పెళ్లి చేసుకుని కాపురం చేస్తే ఎలా.. ఇద్ద‌రూ ట‌చ్ చేసుకుంటారు క‌దా.. అప్పుడు కూడా విద్యుత్ ప్ర‌వ‌హిస్తుంది క‌దా.. మ‌ర‌లాంట‌ప్పుడు వారు కాపురం ఎలా చేస్తారు.. అస‌లు ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు క‌నీసం ఎలా ట‌చ్ చేసుకుంటారు.. అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. అయితే ఇందుకు స‌మాధానాలు చెప్ప‌డం ద‌ర్శ‌కుడి చేతుల్లోనే ఉంది. కానీ ఈ లాజిక్‌ను అస‌లు ప్రేక్ష‌కులు ఎవ‌రూ ఆలోచించ‌లేదు. గుర్తించ‌లేదు. అస‌లు ఆ ఆలోచ‌నే ఎవ‌రికీ రాలేదు. కానీ సినిమాను అలా చూస్తూ ఎంజాయ్ చేశారు. క‌థ బాగుంటే ఇలాంటి లాజిక్స్ ఎన్ని మిస్ అయినా ఓకే. అదే క‌థ లేక‌పోతే ఇలాంటి అంశాల‌ను కూడా వేలెత్తి చూపిస్తారు. క‌నుక సినిమాకు క‌థ ఆయువు ప‌ట్టు లాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఇలాంటి మిస్టేక్స్ ఉన్న‌ప్ప‌టికీ మ‌గ‌ధీర‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది.

Admin

Recent Posts