Vitamin D Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఆ విట‌మిన్ లోపం కావ‌చ్చు..!

Vitamin D Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి. వాటిలో విట‌మిన్ డి కూడా ఒక‌టి. ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి అందుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, డిప్రెష‌న్, టైప్ 2 డ‌యాబెటిస్, గుండె జ‌బ్బుల వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్ల‌య బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో విట‌మిన్ డి ఎంతో అవ‌స‌ర‌మవుతుంది. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు. విట‌మిన్ డి లోపం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా ఉంచే విట‌మిన్ డి లోపిస్తే మ‌నం అనేక ర‌కాల ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌నం విట‌మిన్ డి లోపాన్ని గుర్తించ‌వ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి శ‌రీరంలో విట‌మిన్ డి లోపం ఉందో లేదా చాలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల మ‌న‌లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల విప‌రీత‌మైన నీర‌సంతో పాటు త‌ల తిర‌గిన‌ట్టుగా ఉంటుంది. దీనికార‌ణంగా నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా త‌లెత్తుతుంది. విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల మాన‌సికంగా కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. డిప్రెష‌న్, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డతారు. అలాగే ఎముక‌ల నిర్మాణంలో విట‌మిన్ డి మ‌రియు క్యాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Vitamin D Deficiency Symptoms in telugu must know about them
Vitamin D Deficiency Symptoms

విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఎక్కువ‌వుతాయి. ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గుతుంది. అంతేకాకుండా విటమిన్ డి లోపించ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల పొట్ట పెర‌గ‌డంతో పాటు శ‌రీర బ‌రువు కూడా పెరుగుతార‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. విట‌మిన్ డి క్యాప్సుల్స్ ను వాడ‌డంతో పాటు విట‌మిన్ డి ఎక్కుగా ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అలాగే రోజు ఎండ‌లో కూర్చోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా విట‌మిన్ డి లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు.

Share
D

Recent Posts