Foods For Heart Health : త‌ర‌చూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే.. మీ గుండె 100 ఏళ్లు ప‌దిలంగా ఉంటుంది..!

Foods For Heart Health : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యావాల్లో గుండె ఒక‌టి. గుండె త‌న క్ర‌మాన్ని నియ‌మాన్ని త‌ప్పి ఎక్కువ‌గా కొట్టుకున్నా, త‌క్కువ‌గా కొట్టుకున్న అది మ‌న జీవితాలను శాసించే వ్యాధికి అన‌గా గుండె జ‌బ్బుకు గురైన‌ట్టే. ప్ర‌స్తుత కాలంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. గుండె జ‌బ్బుల బారిన ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డానికి కంటే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డ‌మే ఉత్త‌మం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవ‌లం ఆమారం మాత్ర‌మే కాదు వ్యాయామాలు కూడా చేయాలి. కేవ‌లం 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల లేదా 10 నుండి 15 నిమిషాల పాటు సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల పూర్తి ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

మ‌న చిన్న గుండెకు మేలు చేసే వ్యాయామాల్లో వాకింగ్ ఒక‌టి. ఈ సులువైన వ్యాయామం వ‌ల్ల గుండె ఆరోగ్యంతో పాటు శ‌రీర వ్యాయామం కూడా మెరుగుప‌డుతుంది. లిఫ్ట్, ఎస్క‌లేట‌ర్ వంటి వాటిని వాడ‌కుండా మెట్లు ఎక్కాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మృద‌య స్పంద‌న రేటు 50 నుండి 85 శాతం వ‌ర‌కు మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఎక్కువ‌గా మెరుగుప‌రిచే వ్యాయామాల్లో ఈత ఒక‌టి. రోజుకు క‌నీసం 20 నుండి 30 నిమిషాల పాటు ఈత కొట్ట‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే ఒక గంట పాటు ఎక్కువ‌గా విశ్రాంతి తీసుకునే వారిలో ధ‌మ‌నుల‌ల్లో అడ్డంకులు ఏర్ప‌డే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే త‌గినంత నిద్ర చాలా అవ‌స‌రం. అలాగే ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి.

Foods For Heart Health must take them regularly
Foods For Heart Health

మితిమీరిన మ‌ద్య‌పానం కార‌ణంగా బీపీ, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అంతేకాకుండా త‌గు మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొవ్వు స్థాయిలు పెరుగుతాయ‌ని ఫ‌లితంగా గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ధూమ‌పానానికి కూడా దూరంగా ఉండాలి. అలాగే ఒత్తిడికి గురైయ్యే వారు నాలుగ‌వ వంతు గుండెపోటుకు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. సాధార‌ణంగా మ‌నం తీసుకునే ఆహారం ఎన్నో విధాలుగా మ‌నకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌నం తీసుకునే ఆహారాల్లో పోష‌కాలు కొన్నింటిలో ఎక్కువ‌గానూ, కొన్నింటిలో త‌క్కువ‌గానూ ఉంటాయి. మ‌న గుండెకు మేలు చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అలాగే సాల్మ‌న్ చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శ‌రీరంలో కొవ్వును త‌గ్గించి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చేయ‌డంలో డార్క్ చాక్లెట్ కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

శ‌రీరంలో కొవ్వును త‌గ్గిస్తుంది. దానిమ్మ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. వీటిలో ఉండే ఫైటో న్యూట్రియ‌న్స్ గుండెకు ఎంతో బ‌లాన్ని ఇస్తాయి. అదే విధంగా ఆలివ్ నూనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మ‌నం గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఇందులో ఉండే మోనో స్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెలో కొవ్వు చేర‌కుండా చేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు చ‌క్క‌గా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రిగేలా చేస్తాయి. గుండెకు ఎంతో మేలు చేసే ఆహారాల్లో రెడ్ వైన్ ఒక‌టి. ఇది శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండెకు బ‌లాన్ని చేకూరుస్తుంది. అలాగే ట‌మాటాల‌లో ఉండే లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెకు ఎంతో బ‌లాన్ని ఇస్తుంది.

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భించ‌డంతో పాటు గుండె కొట్టుకునే వేగం క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌బ‌డుతుంది. గుండెలో మంట కూడా త‌గ్గుతుంది. ట‌మాటాల‌ను రోజూ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌తిరోజూ వ్యాయామాలు చేస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాణాంత‌క‌మైన గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts