Red Bananas : సాధారణంగా మనకు అరటి పండు అనగానే పసుపు లేదా నల్లని మచ్చలతో కూడిన అరటి పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే వాస్తవానికి అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఎరుపు రంగు అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగు అరటి పండ్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందుకనే అవి ఆ రంగులో ఉంటాయి. ఈ బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఫలితంగా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనుక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా ఎరుపు రంగు అరటి పండ్లు మనకు ఉపయోగపడతాయి.
ఇక ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే మలబద్దకం ఉండదు. అలాగే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఎరుపు రంగు అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. ఇది హైబీపీ ఉన్నవారికి మేలు చేసే విషయం. అలాగే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎరుపు రంగు అరటి పండ్లలో ఫ్రక్టోజ్, సూక్రోజ్ అనే సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో నెమ్మదిగా కలుస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎరుపు రంగు అరటి పండ్లను నిస్సందేహంగా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎరుపు రంగు అరటి పండ్లు పురుషులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి వారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. మూడ్‌ను మారుస్తాయి. దీంతో శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే ఈ పండ్లలో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారి కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా ఎరుపు రంగు అరటి పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పసుపు రంగు అరటి పండ్లను తింటే బరువు పెరుగుతామని భయపడేవారు ఈ ఎరుపు రంగు అరటి పండ్లను తినవచ్చు. దీంతో పైన తెలిపిన లాభాలను పొందవచ్చు.