Carrot Puri : క్యారెట్ల‌తో పూరీల త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Carrot Puri : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్లు ఒక‌టి. వీటిని నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. క్యారెట్ల‌ను మ‌నం త‌ర‌చూ ఎన్నో వంటల్లోనూ వేస్తుంటాం. అయితే క్యారెట్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే క్యారెట్ల‌తో పూరీల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Carrot Puri in this method everybody likes it
Carrot Puri

క్యారెట్ పూరీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమపిండి – ఒక‌ కప్పు, క్యారెట్ రసం – పావుకప్పు, బొంబాయి రవ్వ – రెండు చెంచాలు, నూనె – తగినంత, ఉప్పు – తగినంత.

క్యారెట్‌ పూరీల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి. క్యారెట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కల‌పాలి. పావుగంట పాటు అలాగే పిండిని ఉంచి నాన‌బెట్టాలి. దీంతో పూరీలు మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి. తరువాత స్ట‌వ్‌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకొని రెండేసి చొప్పున నూనెలో వేసి వేయించుకొని తీయాలి. అంతే క్యారెట్ పూరీ తయారయినట్లే. ఈ పూరీలను మీకు ఇష్ట‌మైన కూర‌తో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.

Editor

Recent Posts