మీరు వాడుతున్న కోడిగుడ్లు అస‌లువా, న‌కిలీవా.. ఇలా గుర్తించండి..!

మార్కెట్‌లో ప్ర‌స్తుతం మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక ఆహార ప‌దార్థాలు క‌ల్తీ అవుతున్నాయి. అందులో భాగంగానే కొంద‌రు వ్యాపారులు క‌ల్తీ చేయ‌బ‌డిన ఆహారాల‌ను అమ్ముతూ సొమ్ము గ‌డిస్తున్నారు. కానీ వాటిని తింటున్న మ‌న‌కు మాత్రం అనారోగ్యాలు వ‌స్తున్నాయి. అయితే మార్కెట్‌లో న‌కిలీ కోడిగుడ్లు కూడా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు విక్ర‌యిస్తుంటారు. ఈ క్ర‌మంలో వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు వాడుతున్న కోడిగుడ్లు అస‌లువా, న‌కిలీవా.. ఇలా గుర్తించండి..!

గ్లూకోలాక్టేన్‌, బెంజోయిక్ యాసిడ్‌, సెల్యులోజ్‌, ఆలం, అమైనో యాసిడ్‌, సోడియం అల్జినేట్‌, గెలాటిన్ వంటి ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ముందుగా ప‌చ్చ‌సొన‌, తెల్ల‌సొన‌ల‌ను విడి విడిగా త‌యారు చేస్తారు. ప‌చ్చ‌సొన అచ్చం గుడ్డు సొన‌లా క‌నిపించాల‌ని దానికి ఒక ప్ర‌త్యేక‌మైన క‌ల‌ర్‌ను క‌లుపుతారు. త‌రువాత తెల్ల‌సొన‌లో ప‌చ్చ‌సొన‌ను ఉంచి దాన్ని కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం కార్బొనేట్‌తో తయారు చేసిన గుడ్డు లాంటి తెల్ల‌ని షెల్‌లో అచ్చులా పోస్తారు. అప్పుడ‌ది కోడిగుడ్డులా త‌యారవుతుంది. ప్ర‌స్తుతం అక్క‌డ‌క్క‌డా ఇలాంటి న‌కిలీ కోడిగుడ్ల‌ను త‌యారు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి వీటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అస‌లు కోడిగుడ్డు క‌న్నా న‌కిలీ కోడిగుడ్డు పై పొర (షెల్‌) బాగా ప్ర‌కాశ‌వంతంగా, మెరుపుతో క‌నిపిస్తుంది. అస‌లు కోడిగుడ్డుకు మెరుపుద‌నం కొద్దిగా త‌క్కువ‌గా ఉంటుంది.

2. న‌కిలీ కోడిగుడ్డును పైన ట‌చ్ చేస్తే అది కొంత ర‌ఫ్‌గా అనిపిస్తుంది.

3. కోడిగుడ్డును ఊపి చూడాలి. దాన్నుంచి ఏవైనా సౌండ్స్ వ‌స్తే దాన్ని న‌కిలీ గుడ్డుగా అనుమానించాలి.

4. న‌కిలీ గుడ్ల‌కు అస‌లు నీచు వాస‌న రాదు. అస‌లు కోడిగుడ్ల‌కు నీచు వాసన వ‌స్తుంది.

5. గుడ్డును చిన్న‌గా ట‌క్ ట‌క్ మ‌ని కొట్టి చూడాలి. అస‌లు కోడిగుడ్డు అయితే ట‌క్ ట‌క్ మ‌ని బాగా వినిపిస్తుంది.

6. నకిలీ కోడిగుడ్డును ప‌గ‌ల గొట్ట‌గానే అందులోని సొన‌లు మ‌న ప్రమేయం లేకుండానే సుల‌భంగా క‌లిసిపోతాయి.

7. న‌కిలీ గుడ్డును ప‌గ‌ల‌కొట్టి ఫ్రై చేస్తే అందులో ఉండే ప‌దార్థాలు పెనంపై సుల‌భంగా విస్త‌రిస్తాయి. అస‌లు కోడిగుడ్డ‌యితే సొన‌ల‌ను విస్త‌రించ‌డానికి మ‌నం క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

8. న‌కిలీ గుడ్ల‌లో ప‌చ్చ‌ని సొన కొన్ని సార్లు మ‌ధ్య‌లో తెల్ల‌గా క‌నిపిస్తుంది.

ఈ విధంగా న‌కిలీ కోడిగుడ్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts