పండ్లు

జీర్ణ వ్య‌వ‌స్థ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు, అధిక బ‌రువుకు మేలైన ఆహారం.. బొప్పాయి..!

బొప్పాయి పండు మ‌న‌కు ఏడాది పొడ‌వునా దొరుకుతుంది. అన్ని సీజ‌న్ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీంట్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. విట‌మిన్ ఎ, బి, సి, డిలు బొప్పాయి పండ్ల‌లో పుష్క‌లంగా ఉంటాయి. దీంతోపాటు ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో బొప్పాయి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు కూడా. బొప్పాయి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సంరక్షణకు బొప్పాయి బాగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌గా వేసి వాడుకోవచ్చు.

ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులకు కూడా ఉపయోగించవచ్చు. చర్మంలో ఏర్పడే మృత కణాలను పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు బొప్పాయి తోడ్పడుతుంది. వయస్సు మీద పడిన వారిలోనూ ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. వారి సౌందర్యాన్ని పెంచుతుంది. శరీరంలోని, రక్తకణాలలోని కొవ్వును తీసివేయడంతోపాటు గుండెపోటు రానీయకుండా చూస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ బొప్పాయిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. మలబద్దకానికి బొప్పాయి మంచి మందు. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు నిత్యం బొప్పాయి తింటే ఫ‌లితం ఉంటుంది.

many wonderful health benefits of papaya

విటమిన్ ఎ, సిలు బొప్పాయిలో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ బొప్పాయి తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మహిళల్లో తలెత్తే రుతు సంబంధ సమస్యలను తొలగిస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయంలో ఉండే క్యాన్సర్ కారక క్రిములను నాశనం చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు నిత్యం బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు తక్కువ క్యాలరీలను అందజేస్తాయి. సన్నగా మారాలనే వారికి బొప్పాయి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

చుండ్రు సమస్యతో బాధపడేవారు బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం, వెనిగర్ కలిపి తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. పచ్చి బొప్పాయిని మెత్తని ముద్దగా చేసి దాని నుంచి రసం తీసి కొబ్బరి నూనెలో కలపాలి. ఆ నూనెను తలస్నానానికి ముందు రోజు రాస్తే ఫలితం ఉంటుంది. బొప్పాయి, అరటి గుజ్జును సమపాళ్లలో తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొంత నీరు కలిపి ముఖానికి మర్దనా చేసుకుని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లీన్సర్‌గా పనిచేస్తుంది. చర్మం గరుకుగా ఉంటే బొప్పాయి గుజ్జును రాసి కొంత సేపటి తరువాత నీటితో కడిగి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. బొప్పాయి కలిపిన ముల్తానీ మట్టితో తరచూ పూత వేసుకోవడం వల్ల ముడతల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.

Admin

Recent Posts